ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 179.35 పాయింట్లు (0.57%) లాభపడి 31,768.07 వద్ద, నిఫ్టీ 47.50 పాయింట్లు (0.51%) లాభపడి 9,314.25 వద్ద ప్రారంభమైంది. 764 షేర్లు లాభాల్లో, 173 షేర్లు నష్టాల్లో ఉండగా, 54 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ 5 శాతం పెరిగింది. నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐవోసీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, ఐచర్ మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంకు, హిండాల్కో ఉన్నాయి.

మార్కెట్ రికవరీ
గత రెండు మూడు నెలలుగా నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఏప్రిల్ నెలలో రెండు వారాలుగా లాభాలను చూస్తున్నాయి. కరోనా మహమ్మారి నుండి మార్కెట్లు రికవరీ అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. మే 3వ తేదీ నాటికి లాక్ డౌన్ ముగుస్తుండటంతో అప్పటి వరకు మార్కెట్లు ఎలా ఉంటాయనేది ప్రశ్నగా ఉంది.

డైలమాలో మార్కెట్లు
జనవరి మిడిల్ నుండి భారీగా నష్టపోయాయి మార్కెట్లు. ఇటీవలి వరకు 38 శాతం వరకు నష్టాలను మిగుల్చుకున్నాయి సెన్సెక్స్, నిఫ్టీలు. గత నెలలో 20 శాతం నష్టపోయిన సూచీలు ఈ నెలలో 7 శాతం లాభపడ్డాయి. మొత్తానికి స్టాక్ మార్కెట్లు గత కొద్ది నెలలుగా డైలమాలో ఉన్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications