స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో అశ్వత్ దామోదరన్ అనే పేరు చాలామంది వినే ఉంటారు. వాల్‌స్ట్రీట్‌లో అత్యంత నమ్మదగిన వాల్యుయేషన్ నిపుణుడిగా, ఆయన చెప్పే ప్రతి మాట ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను ఆలోచింపజేస్తుంది. ఇంతకుముందు ఎన్నడూ కనిపించని ఆందోళనతో ఆయన తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు మార్కెట్‌లో అలజడి రేపుతున్నాయి. ఎన్నో సంవత్సరాల అనుభవం, వందల కంపెనీల విశ్లేషణ, స్పష్టమైన లెక్కలు.. ఇవన్నీ ఉన్న దామోదరన్ తొలిసారిగా "భయం" అనే పదాన్ని ఉపయోగించారు. అదే పెట్టుబడిదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
ఇప్పుడొచ్చిన పరిస్థితులు చూసి నా డబ్బును స్టాక్స్‌లో పెట్టాలనే ధైర్యం రావడం లేదు. నగదుగానైనా ఉంచాలని, లేకపోతే బంగారం, కలెక్టబుల్స్‌లాంటి భౌతిక ఆస్తుల వైపు మళ్లాలని నా మనసు చెబుతోంది అని ఆయన అన్న మాటలు సాధారణ అభిప్రాయం కాదు.. మార్కెట్‌లో ఏదో అసాధారణమైన సంఘటనా సంకేతంగా భావిస్తున్నారు.

కృత్రిమ మేధస్సు (AI) పై పెరిగిపోయిన హైప్ వల్ల అంచనా దాటి స్టాక్స్ ఎగబాకుతున్నాయనే భావన ఆయనకు బలంగా ఉంది. ఈ పెరుగుదల బలమైన ఫండమెంటల్స్‌పై కాకుండా, ఊహాగానాలపై ఆధారపడినదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో, ఆయన జీవితాంతం పాటించిన డైవర్సిఫికేషన్ అనే పెట్టుబడి నియమం కూడా ఇప్పుడు పనిచేయదని చెప్పారు. పాసివ్ ఇన్వెస్టింగ్, ఇండెక్స్ ఫండ్స్ పెరగడంతో మార్కెట్‌లో రిస్క్ విభజన అనే వ్యవస్థే బలహీనపడిపోయిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇన్నాళ్లుగా పెట్టుబడులను విభజించుకోవడం రక్షణ అని చెప్పాం. కానీ ప్రస్తుతం అది నిజం కాదు. మార్కెట్లు ఎలా కదులుతున్నాయో చూస్తే, సేఫ్టీ అనే మాటే కనబడటం లేదని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు.
దామోదరన్ మాటల్లో కనిపిస్తున్న భయానికి కారణం ఏంటంటే.. ఆయన ఫండమెంటల్స్ ఆధారంగా మాట్లాడే వ్యక్తి. అయితే ఈసారి ఆయన భావోద్వేగం ముందుకు వచ్చింది. బంగారం ధరలు గత ఏడాది 60-70 శాతం పెరిగాయి. స్టాక్స్ మాత్రం 15-20 శాతం రాబడి మాత్రమే ఇచ్చాయి. ఈ అసమానత, సాధారణ మార్కెట్ ను వివరిచే పరిస్థితి కాదు. ఇది భవిష్యత్తులో పెద్ద కుదుపు రాబోతున్నదనే స్పష్టమైన సంకేతం అని ఆయన భావిస్తున్నారు. ఇలా బంగారం పరుగులు తీస్తుంటే ఏదో పెద్ద తప్పు జరుగుతోంది అని.. ఇది సాధారణ చలనమేమీ కాదని అన్నారు.
త్వరలో స్టాక్ మార్కెట్లో పెద్ద పతనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. 30-35 శాతం కాదు, అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. ఈ పరిస్థితుల్లో స్టాక్స్ గానీ బాండ్స్ గానీ సురక్షితం అనిపించడం లేదని దామోదరన్ స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు సంప్రదాయ సూత్రాలను మాత్రమే నమ్మి ముందుకు సాగితే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించి, మార్కెట్‌లో అతి ఎక్కువగా పెరిగిన వాల్యూయేషన్లను అర్థం చేసుకుని, మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
Ashwath Damodaran కెరీర్ మొత్తంలో డేటా, లాజిక్, అనుభవం.. ఇవన్నీ ఆధారంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసిన అశ్వత్ దామోదరన్ ఈ రోజు భయంతో మాట్లాడటం చిన్న విషయం కాదు. AI బబుల్, అధిక వేగంతో పరిగెత్తిన స్టాక్స్, అసాధారణంగా పెరిగిన బంగారం ధరలు... ఇవన్నీ కలిసి ఒక పెద్ద యుగాంతర సంకేతాన్ని ఇస్తున్నాయనే భావన ఆయనలో బలంగా ఉంది.మార్కెట్‌లో ఏదో చెడు రాబోతోంది. జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి పెట్టుబడి పెట్టండని దామోదరన్ స్పష్టంగా చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications