ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (మే 25) లాభాలతో ప్రారంభమై, మధ్యాహ్నం వరకు అలాగే కదలాడి, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. తిరిగి కాస్త పుంజుకున్నప్పటికీ చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ స్వల్ప నష్టాల్లో ముగియగా, అదే సమయంలో నిఫ్టీ అతి స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయం సానుకూల సంకేతాల నేపథ్యంలో ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అలాగే కరోనా కేసులు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. వ్యాక్సిన్ల కొరత, బ్లాక్ ఫంగస్ కేసులు మార్కెట్‌ను వెంటాడటంతో సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. దీనికి తోడు గత రెండు సెషన్ల భారీ లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో ఆర్థిక, విద్యుత్, బ్యాంకింగ్, ఇంధన రంగ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 50,922.32 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,961.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,474.34 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 14.37 (0.28%) పాయింట్లు నష్టపోయి 50,637.53 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,291.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,293.85 వద్ద గరిష్టాన్ని, 15,163.40 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 10.75 (0.71%) పాయింట్లు లాభపడి 15,208.45 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బ్రిటానియా 2.21 శాతం, ఏషియన్ పేయింట్స్ 3.38 శాతం, టైటాన్ కంపెనీ 3.18 శాతం, ఐచర్ మోటార్స్ 2.89 శాతం, JSW స్టీల్ 2.84 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు 2.05 శాతం, HDFC లైఫ్ 1.66 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.30 శాతం, రిలయన్స్ 1.13 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 1.08 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో SBI, టాటా స్టీల్, JSW స్టీల్, HDFC బ్యాంకు, రిలయన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.07 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.27 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో 0.66 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.60 శాతం, నిఫ్టీ ఐటీ 0.96 శాతం, నిఫ్టీ మీడియా 3.17 శాతం, నిఫ్టీ మెటల్ 0.61 శాతం, నిఫ్టీ ఫార్మా 0.40 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.37 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.81 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.21 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.71 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.34 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.90 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications