రిలయన్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ ఎఫెక్ట్: సూచీలు హైజంప్

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (డిసెంబర్ 8) లాభాల్లో ముగిశాయి. కరోనా వ్యాక్సీన్ వేగంగా అందుబాటులోకి వస్తుందనే వార్తల నేపథ్యంలో సూచీలు నేడు మరోసారి జీవనకాల గరిష్టాన్ని తాకాయి. గత నెల రోజులుగా సూచీలు సరికొత్త రికార్డులతో ముందుకు సాగుతున్నాయి. మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 181.54 పాయింట్లు (0.40%) లాభపడి 45,608.51 వద్ద, నిఫ్టీ 37.20 పాయింట్లు (0.28%) ఎగిసి 13,393 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1344 షేర్లు లాభాల్లో, 1374 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 130 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

సూచీలు జంప్, రిలయన్స్ అప్ అండ్ డౌన్

సూచీలు జంప్, రిలయన్స్ అప్ అండ్ డౌన్

సెన్సెక్స్ ఓ సమయంలో 45,742 పాయింట్లను తాకింది. గతవారమే 45వేల మార్క్ అందుకున్న సెన్సెక్స్ పది సెషన్ల లోపే 46,000 మార్కు దిశగా దూసుకెళ్తోంది. నెల రోజుల్లోనే 42వేల నుండి 45వేలకు చేరుకుంది. నిఫ్టీ కూడా అంతకంతకూ పైకి ఎగుస్తోంది. నిఫ్టీ 400 దిశగా సాగుతోంది. నేడు 13,392 పాయింట్ల వద్ద ముగిసింది.

నేడు 45,742 పాయింట్లను తాకిన సెన్సెక్స్, 45,335 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. దాదాపు 400 పాయింట్ల మధ్య సెన్సెక్స్ కదలాడింది.

రిలయన్స్, ఐటీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. దీంతో మార్కెట్లు ఎగిశాయి.

నేడు రిలయన్స్ స్టాక్ ఓ సమయంలో రూ.2,010ని తాకింది. చివరకు రూ.1992 వద్ద క్లోజ్ అయింది. ఈ స్టాక్ చాన్నాళ్లకు రూ.2000 దాటినప్పటికీ ఆ తర్వాత ఆ దిగువనే క్లోజ్ అయింది.

భారీగా లాభపడ్డవి.. నష్టపోయినవి..

భారీగా లాభపడ్డవి.. నష్టపోయినవి..

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్ 3.19 శాతం, టీసీఎస్ 2.18 శాతం, రిలయన్స్ 1.82 శాతం, విప్రో 1.46 శాతం, HCL టెక్ 0.99 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో సన్ ఫార్మా 2.34 శాతం, హిండాల్కో 2.21 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.97 శాతం, కోల్ ఇండియా 1.86 శాతం, అదాని పోర్ట్స్ 1.73 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఎస్బీఐ, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 16 భారీగా లాభపడ్డాయి. అన్ని రంగాల్లో ఎనర్జీ భారీగా లాభపడింది. టెలికం సెక్టార్ భారీగా నష్టపోయింది.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

రంగాలవారీగా నిఫ్టీ బ్యాంకు 0.17 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.17 శాతం, నిఫ్టీ ఐటీ 0.79 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 7.13 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.83 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ ఆటో 0.14 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.18 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.05 శాతం, నిఫ్టీ మీడియా 0.93 శాతం, నిఫ్టీ మెటల్ 1.23 శాతం, నిఫ్టీ ఫార్మా 1.18 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.22 శాతం నష్టపోయాయి.

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 2.09 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.92 శాతం, ఇన్ఫోసిస్ 0.83 శాతం, విప్రో 1.41 శాతం, మైండ్ ట్రీ 0.58 శాతం, కోఫోర్జ్ 0.78 శాతం లాభపడ్డాయి.

టెక్ మహీంద్రా 1.36 శాతం నష్టపోయాయి.

హెవీ వెయిట్ కలిగిన రిలయన్స్, ఐటీ స్టాక్స్ లాభపడటంతో మార్కెట్లు ఎగిశాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+