స్టాక్ మార్కెట్లు నేడు (సోమవారం, 29 నవంబర్) లాభాల్లో ముగిశాయి. గతవారం చివరలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనలతో సెన్సెక్స్ 2500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈ రోజు కూడా నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత కాసేపట్లోనే భారీ లాభాల్లోకి వచ్చింది. దేశీయంగా ఉన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్నాయి. దీర్ఘకాలలోను భారత మార్కెట్లపై ఇన్వెస్టర్లు బుల్లిష్‌గా ఉన్న నేపథ్యంలో సూచీలు నష్టాల నుండి లాభాల్లోకి వచ్చాయి. రిలయన్స్ టారిఫ్ పెంపు, ప్రయివేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్బీఐ సానుకూల ప్రతిపాదనలు, ముడి చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలు సూచీలకు అండగా నిలిచాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది.
సెన్సెక్స్ 153.43 (0.27%) పాయింట్లు లాభపడి 57,260.58 పాయింట్ల వద్ద, నిఫ్టీ 27.50 (0.16%) పాయింట్లు లాభపడి 17,053.95 పాయింట్ల వద్ద ముగిసింది.. సెన్సెక్స్ 57,028.04 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,626.51 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,382.93 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,055.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,160.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,782.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.75.09 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో 18 షేర్లు లాభపడ్డాయి. కొటాక్ మహీంద్రా బ్యాంకు, HCL టెక్, టైటాన్, టీసీఎస్, బజాజ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, టెక్ మహీంద్రా, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. అత్యధికంగా నష్టపోయిన వాటిలో సన్ ఫార్మా, NTPC, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, HDFC, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో షేర్లు ఉన్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications