ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు, కొత్త ప్రైస్ సర్క్యూట్ రూల్స్ ఎఫెక్ట్

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్ట్ 11) అతిస్వల్ప నష్టాల్లో లేదా ఫ్లాట్‌గా ముగిశాయి. నేడు ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు కాసేపటికి నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా మార్కెట్లలో కొనసాగుతున్న కరోనా వేవ్ ఆందోళనలు, సూచీలపై ప్రభావం చూపాయి. అలాగే, కీలక కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ కావడం సూచీలను కిందకు లాగాయి. అయితే రోజంతా నష్టాల్లో కొనసాగిన సూచీలు మధ్యాహ్నం నుండి కాస్త కోలుకున్నట్లుగా కనిపించాయి. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి కనిష్ఠాల నుండి కోలుకున్నప్పటికీ పూర్తిస్థాయి లాభాల్లోకి రాలేకపోయాయి. చివరకు సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 54,525 వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు ఎగిసి 16,282 వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.44 వద్ద ట్రేడ్ అయింది.

సెన్సెక్స్ ఉదయం 54,730.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,758.74 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,167.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,327.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,338.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,162.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నిన్న ఆల్ టైమ్ గరిష్టం 54,554 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు స్వల్పంగా క్షీణించింది.

Market ends flat: Sensex trim losses as metal stocks shine

బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.83 శాతం, మిడ్ క్యాప్ సూచీ 0.22 శాతం క్షీణించింది. ఈ సూచీలు ప్రారంభంలో వరుసగా 2.2 శాతం, 3.3 శాతం మేర పతనమయ్యాయి. కానీ ఆ తర్వాత కోలుకోవడంతో స్వల్ప నష్టాలకు పరిమితం అయ్యాయి. ఎక్సెసివ్ ప్రైస్ మూమెంట్‌ను అరికట్టేందుకు సెక్యూరిటీస్ పైన అదనపు ధర పరిమితులను విధిస్తున్నట్లు బీఎస్ఈ లిమిటెడ్ సర్క్యులర్ సూచీలపై ప్రభావం చూపింది. అయితే బుధవారం స్టాక్ ఎక్స్చేంజీ ఈ సర్క్యులర్ పైన స్పష్టత ఇచ్చింది. కొత్త ప్రైస్ సర్క్యూట్ రూల్స్ రూ.10 కంటే ఎక్కువ ధర కలిగిన, రూ.10 బిలియన్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన వాటికి వర్తిస్తాయని తెలిపింది. ప్రస్తుతానికి ఈ నిబంధనలు వర్తించే 31 స్టాక్స్ జాబితాను విడుదల చేసింది.

దీంతో పాటు వేగంగా విస్తరిస్తోన్న డెల్టా వేరియంట్ ఆందోళనలు ఆసియా మార్కెట్ బలహీనతలకు కారణం. ఇది ఇన్వెస్టర్ సెంటిమెంటును బలహీనపడింది. మరోవైపు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 32 మిలియన్లు దాటింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3.14 శాతం ఎగిసింది.

Market ends flat: Sensex trim losses as metal stocks shine

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ, HDFC బ్యాంకు, రిలయన్స్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 3.83 శాతం, JSW స్టీల్ 3.73 శాతం, ఐవోసీ 2.35 శాతం, ఎన్టీపీసీ 2.27 శాతం, హిండాల్కో 2.27 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్ 2.10 శాతం, బజాజ్ ఆటో 1.86 శాతం, కొటక్ మహీంద్రా 1.80 శాతం, సన్ ఫార్మా 1.74 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.05 నష్టపోయాయి. సాలిడ్ హెల్త్ కేర్ సర్వీసెస్ నేపథ్యంలో హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ 5 శాతం లాభపడింది. జొమాటో లిమిటెడ్ 8.4 శాతం ఎగిసిపడింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+