ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం(సెప్టెంబర్ 11) ప్లాట్‌గా ముగిశాయి. ఉదయం గం.9.20 సమయానికి సెన్సెక్స్ 82.88 పాయింట్లు లేదా 0.21 శాతం తగ్గి 38,757.44 వద్ద, నిఫ్టీ 15.50 పాయింట్లు లేదా 0.14 శాతం తగ్గి 11,433.80 వద్ద ప్రారంభమైంది. స్వల్ప లాభ, నష్టాల మధ్యే మార్కెట్లు ఊగిసలాడాయి. చివరకు సెన్సెక్స్ కేవలం 14 పాయింట్లు లేదా 0.04 శాతం పెరిగి 38,854 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 11,464 వద్ద క్లోజ్ అయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు వరుసగా 0.58 శాతం, 0.52 శాతం పెరిగాయి

ఐటీ రంగం జూమ్
ఐటీ, రియాల్టీ, బ్యాంకింగ్ రంగాలు మంచి లాభాలు చూశాయి. టెలికం ఇండెక్స్ మాత్రం దాదాపు ఒక శాతం నష్టపోయింది. టాప్ గెయినర్స్ జాబితాలో ఐటీ షేర్లు ముందున్నాయి. ఈ రోజు ఐటీ షేర్లు భారీగా ఎగిశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, టీసీఎస్, యూపీఎల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, ఇండస్ ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి. ఈ రోజు నిఫ్టీ ఐటీ భారీగా లాభపడింది. ఇక, డాలర్ మారకంతో రూపాయి 73.53 వద్ద క్లోజ్ అయింది. గురువారం 73.46 వద్ద క్లోజ్ కాగా, ఈ రోజు 7 పైసలు నష్టంతో ముగిసింది.

విప్రో అదుర్స్
విప్రో ఏకంగా 3 శాతానికి పైగా ఎగిసింది. ఎస్బీఐ దాదాపు 3 శాతం, టెక్ మహీంద్రా 1.76 శాతం, టీసీఎస్ 1.69 సాతం, హిందూస్తాన్ యూనీలీవర్ 1.19 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.03 శాతం, కొటక్ మహీంద్రా 0.97 శాతం, టైటాన్ 0.88 శాతం, ఇన్ఫోసిస్ 0.54 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.19 శాతం, బజాజ్ ఆటో 0.12 శాతం, రిలయన్స్ 0.06 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 14 పాయింట్లు, మిడ్ క్యాప్ ఇండెక్స్ 113 పాయింట్లు లాభపడ్డాయి.
భారతీ ఎయిర్ టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్లను కిందకు లాగాయి.
విప్రో ఏకంగా 3 శాతానికి పైగా ఎగిసి 52 వారాల గరిష్టానికి చేరుకుంది.
అదానీ గ్రీన్ అప్పర్ సర్క్యూట్ సమీపంలో ముగిసింది. అదానీ గ్రీన్ మంచి లాభాలను, రెవెన్యూను ప్రకటించింది.
మ్యాక్స్ హెల్త్ అయితే 17 శాతం లాభపడింది. కోపోర్జ్ తో డీల్ అనంతరం ఈ షేర్ వ్యాల్యూ పెరిగింది. జుబిలాంట్ ఫుడ్, టాటా ఎల్‌ఎక్సీ 52 వారాల గరిష్టానికి చేరుకుంది.

ఈ వారం టాప్ రిలయన్స్
ఈ వారంలో నిఫ్టీ, సెన్సెక్స్ భారీగా ఎగిసింది. నిఫ్టీ బ్యాంకు, మిడ్ క్యాప్ ఇండెక్స్ నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా ఈ వారంలో లాభపడ్డాయి. ఈ వారంలో భారీగా లాభపడిన షేర్‌గా రిలయన్స్ ముందు ఉంది. ఈ షేర్ వ్యాల్యూ ఏకంగా 11 శాతం పెరిగింది. రిలయన్స్ రిటైల్ లోకి అమెజాన్ పెట్టుబడులు రావొచ్చునని భావిస్తున్నారు. అలాగే కేకేఆర్ పెట్టుబడులు పెడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఈ షేర్ వ్యాల్యూ భారీగా పెరిగింది. గత ఏడు వారాల్లోనే ఇది గరిష్ట జంప్.
ఈ వారం నిఫ్టీ బ్యాంక్ 2.3 శాతం, మిడ్ క్యాప్ 1 శాతం మేర నష్టపోయింది. విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బీపీసీఎల్, ఏషియన్ పేయింట్స్ కూడా లాభపడ్డాయి. గెయిల్, భారతీ ఎయిర్టెల్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఓఎన్జీసీ, ఈ వారం టాప్ లూజర్స్.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications