స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమై, రోజంతా దాదాపు అదే స్థాయిలో ఉండి, చివరి అరగంటలో స్వల్ప లాభాల్లోకి వచ్చినప్పటికీ, ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి వెళ్లినప్పటికీ అది స్వల్పమే. నేడు (14 జనవరి 2022) సెన్సెక్స్ 12.27 పాయింట్లు నష్టపోయి 61,223 పాయింట్లు, నిఫ్టీ 2.05 పాయింట్లు క్షీణించి18,255 పాయింట్ల వద్ద ముగిసింది. అంటే నేడు మార్కెట్లు నష్టాల మధ్య రోజంతా ఊగిసలాడి చివరకు దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. చివరలో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు సూచీలకు అండగా నిలిచింది.

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
సెన్సెక్స్ 61,040.32 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,324.59 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,757.03 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,185.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,286.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,119.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
ఐటీ, క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ స్టాక్స్ నేడు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. ఆటో, ఫార్మా, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల్లో ముగిశాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, టీసీఎస్, ఐవోసీ, ఇన్ఫోసిస్, లార్సన్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, యాక్సిస్ బ్యాంకు, HUl, UPL, ONGC ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

ప్రాఫిట్ బుకింగ్
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో మార్కెట్లు ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గత అయిదు సెషన్ల మార్కెట్ ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ కూడా కనిపించింది. అప్పుడు సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. అయితే బడ్జెట్ అంచనాలు, మూడో త్రైమాసిక ఫలితాల సానుకూల అంచనాలు చివరలో కనిష్టాల వద్ద కొనుగోళ్లకు దోహదపడ్డాయి. హోల్ సేల్ ద్రవ్యోల్భణ గణాంకాలు కూడా సూచీల సానుకూలతలకు దోహదపడ్డాయి.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications