ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు, టాప్ గెయినర్స్, లూజర్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు లాభాల్లో ట్రేడ్ అయి, ఆ తర్వాత భారీగా పతనమైంది. తిరిగి పుంజుకున్నప్పటికీ, తిరిగి కాసేపటికే నష్టాల్లోకి వెళ్లింది. చివరకు అతి స్వల్పంగా లాభపడింది. సెన్సెక్స్ 56,000 పాయింట్లకు సమీపంలో ముగిసింది. నిఫ్టీ 16,700 దిశగా పరుగులు పెట్టి, చివరకు 16,636 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 4.89 (0.0087%) పాయింట్లు లాభపడి 55,949.10 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2.25 (0.014%) పాయింట్లు ఎగిసి 16,636.90 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 56వేల మార్క్ దిగువన ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.22గా ఉంది.
నిఫ్టీలో బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, HDFC లైఫ్, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, JSW స్టీల్, మారుతీ సుజుకీ, హిండాల్కో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్స్ నష్టపోయాయి. ఆటో, ఫార్మా, PSU బ్యాంకు షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. FMCG, ఆయిల్, గ్యాస్, రియల్టీ, పవర్ షేర్లకు కొనుగోళ్లు మద్దతు లభించింది.

రిలయన్స్ 1.29 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.18 శాతం, HCL టెక్ 1.13 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.09 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.98 శాతం లాభపడ్డాయి. భారతీ ఎయిర్టెల్ 4.18 శాతం, మారుతీ సుజుకీ 1.59 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.34 శాతం, ఎస్బీఐ 1.30 శాతం, టాటా స్టీల్ 1.14 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications