ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (బుధవారం, 20) భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న 800 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్, నేడు దాదాపు 400 పాయింట్లు ఎగిసింది. గత వారం చివరి సెషన్‌లో (శుక్రవారం) సెన్సెక్స్ 550 పాయింట్లు, ఈ వారం తొలి సెషన్ (సోమవారం)లో 470 పాయింట్లు కోల్పోయింది. అంటే ఈ రెండు రోజుల్లో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. నిన్ననే ఆ రెండు రోజుల నష్టంలో 80 శాతం రాబట్టిన మార్కెట్లు, నేడు మరోసారి జంప్ చేశాయి. దీంతో వెయ్యి పాయింట్లు కోల్పోగా, ఈ రెండు సెషన్లలో 1200 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ నేడు 50,000 చేరువలో నిలిచింది.

మార్కెట్ జూమ్, రూపాయి జంప్
నేడు సెన్సెక్స్ 393.83 పాయింట్లు లేదా 0.80% లాభపడి 49,792.12 పాయింట్ల వద్ద, నిఫ్టీ 123.50 పాయింట్లు లేదా 0.85% ఎగిసి 14,644.70 పాయింట్ల వద్ద ముగిసింది. 1553 షేర్లు లాభాల్లో, 1407 షేర్లు నష్టాల్లో ముగియగా, 157 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఐటీ, ఆటో, పీఎస్‌యూ బ్యాంకు దాదాపు రెండు శాతం చొప్పున ఎగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీ 0.6 శాతం నుండి 1 శాతం మధ్య లాభపడింది.
డాలర్ మారకంతో రూపాయి 73.02 వద్ద ముగిసింది. ఉదయం 73.11 వద్ద ప్రారంభమైంది. నేడు 73.02-73.14 మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 73.17 వద్ద క్లోజ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 6.28 శాతం, అదానీ పోర్ట్స్ 4.84 శాతం, విప్రో 3.42 శాతం, మారుతీ సుజుకీ 2.81 శాతం, టెక్ మహీంద్రా 2.72 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్ప్ 1.75 శాతం, శ్రీసిమెంట్స్ 1.62 శాతం, NTPC 1.35 శాతం, గెయిల్ 1.18 శాతం, SBI లైఫ్ ఇన్సురా 0.85 నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు దాదాపు రెండు శాతం లాభపడి రూ.2054.70 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.85 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.42 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా నిఫ్టీ ఆటో 2.29 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.37 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.44 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.31 శాతం, నిఫ్టీ ఐటీ 2.21 శాతం, నిఫ్టీ మీడియా 1.06 శాతం, నిఫ్టీ మెటల్ 0.93 శాతం, నిఫ్టీ ఫార్మా 0.12 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.07 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.07 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.26 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మాత్రం 0.16 శాతం నష్టపోయింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications