భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త శిఖరాలకు
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 28) భారీ లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా దాదాపు 400 పాయింట్లు ఎగబాకింది. ఓ సమయంలో 47,400 స్థాయిలోకి వచ్చింది. నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభపడి, 14,000కు మరో 127 పాయింట్ల దూరంలో నిలిచింది. ఓ సమయంలో 13,880 పాయింట్లను క్రాస్ చేసింది. అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీకి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలపడం, కరోనా వ్యాక్సీన్ పైన ఆశాభావ దృక్పంథం నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది.

భారీ లాభాల్లో..
ఈ రోజు సెన్సెక్స్ 380.21 పాయింట్లు(0.81%) ఎగిసి 47,353.75 పాయింట్ల వద్ద, నిఫ్టీ 123.90 పాయింట్లు(0.90%) లాభపడి 13,873.20 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1990 షేర్లు లాభాల్లో, 965 షేర్లు నష్టపోగా, 177 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 73.57 వద్ద క్లోజ్ అయింది. ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లు పెరగడంతో స్వల్పంగా లాభపడింది. 73.52 వద్ద క్లోజ్ అయింది. 73.46-.73.61 మధ్య ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 5.91 శాతం, JSW స్టీల్ 5.56 శాతం, HDFC లైఫ్ 3.26 శాతం, టైటాన్ కంపెనీ 3.19 శాతం, SBI లైఫ్ ఇన్సురెన్స్ 3.18 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో సన్ ఫార్మా 0.59 శాతం, HUL 0.56 శాతం, శ్రీసిమెంట్స్ 0.47 శాతం, బ్రిటానియా 0.41 శాతం, సిప్లా 0.37 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.90 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.42 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.99 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.57 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.86 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.26 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.19 శాతం, నిఫ్టీ ఐటీ 0.38 శాతం, నిఫ్టీ మీడియా 0.99 శాతం, నిఫ్టీ మెటల్ 2.56 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.69 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.59 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.59 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా 0.27 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications