Stock Market: ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లలో పతనం ప్రతి నిమిషానికి పెరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో ఆర్ఎస్ఎస్ అడ్డా వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉండటంతో మార్కెట్ల పతనం కొనసాగుతోంది.
ఇదే క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ముందంజలో ఉండటం మార్కెట్లపై కీలక ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కేవలం 15 నిమిషాల్లోనే భారత ఈక్విటీ మార్కెట్ల విలువ ఏకంగా రూ.14 లక్షల కోట్లు కోల్పోయింది. దీంతో ఇన్వెస్టర్లలో ఆందోళన కొనసాగుతోంది.

ఉదయం 9.51 గంటల సమయంలో మార్కెట్లు నష్టాల నుంచి కొంత తేరుకున్న తర్వాత సెన్సెక్స్ సూచీ 1751 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ సూచీ 523 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అలాగ్ నిఫ్టీ బ్యాంక్ సూచీ 1649 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1498 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి.
ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం NDA సులభంగా విజయం సాధించకపోవడంతో నిఫ్టీ పతనమైంది. ఈ క్రమంలో గౌతమ్ అదానీకి చెందిన లిస్టెడ్ కంపెనీలు పతనంలో కొనసాగుతున్నాయి. నిన్న భారీ ర్యాలీని నమోదు చేసిన అదానీ గ్రూప్ కంపెనీలు నేడు మాత్రం దెబ్బతిన్నాయి. నేడు ప్రారంభ ట్రేడింగ్‌లో ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు, అదానీ గ్రూప్‌లోని కీలక షేర్లు నష్టపోయాయి. వాస్తవానికి ఈ స్టాక్స్ సోమవారం అత్యధికంగా లాభపడ్డాయి.
జూన్ 3వ తేదీన మార్కెట్ ఎన్నికల ఫలితాలను తగ్గించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 350-375 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేస్తోంది. ఈ సంఖ్య నిజమైతే మార్కెట్ లాభాలను కొనసాగించే అవకాశం ఉందని ఈక్విటీ డైరెక్టర్ క్రాంతి బథిని అన్నారు. రెండవ రౌండ్ పూర్తయ్యాక వారణాసిలో మోదీ స్వల్పంగా 400 పైచిలుకు ఓట్ల మెజారిటీతో కొనసాగటం మార్కెట్లకు కొంత ఊరటను కలిగించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications