అదరగొట్టిన మార్కెట్లు: ఆల్ టైమ్ గరిష్టం, సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (నవంబర్ 9) భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఏ దశలో తగ్గలేదు. సూచీలు రికార్డ్ స్థాయిని తాకాయి. సెన్సెక్స్ 704.37 పాయింట్లు(1.68%) ఎగిసి 42,597.43 వద్ద, నిఫ్టీ 197.50 పాయింట్లు(1.61%) లాభపడి 12,461 పాయింట్ల వద్ద ముగిసింది. 1479 షేర్లు లాభాల్లో, 1155 షేర్లు నష్టాల్లో ముగియగా, 181 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు లాభాల్లోనే ముగిశాయి. బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్ దాదాపు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక శాతానికి పైగా ఎగిశాయి.

నిఫ్టీ బ్యాంకింగ్ అదుర్స్

నిఫ్టీ బ్యాంకింగ్ అదుర్స్

సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబిడెన్ గెలుపు నేపథ్యంలో ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ పుంజుకున్నాయి. నిఫ్టీ స్టాక్స్‌లో 43 లాభాల్లో, 7 నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 30లో 27 లాభాల్లో, 3 నష్టాల్లో ముగిశాయి.

నిఫ్టీ ఆటో 0.77 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.74 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.05 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.05 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.01 శాతం, నిఫ్టీ ఐటీ 1.53 శాతం, నిఫ్టీ మెటల్ 1.80 శాతం, నిఫ్టీ ఫార్మా 0.44 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.03 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.48 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 3.28 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ మీడియా మాత్రం 0.01 శాతం నష్టపోయాయి.

డాలర్ మారకంతో రూపాయి 73.94 వద్ద ప్రారంభమైంది. 74.20 వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

టాప్ గెయినర్స్ జాబితాలో దివిస్ 5.76 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 4.98 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 4.87 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 4.49 శాతం, యాక్సిస్ బ్యాంకు 4.30 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా 3.39 శాతం, అదానీ పోర్ట్స్ 1.09 శాతం, ఐటీసీ 0.66 శాతం, మారుతీ సుజుకీ 0.51 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.48 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, దివిస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

అంతకుముందు వారం సెప్టెంబర్ ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ స్టాక్ భారీగా నష్టపోయింది. గతవారం మొదటి రెండు రోజుల్లో భారీగా పడిపోయిన స్టాక్ ధర రూ.1900 దిగువకు చేరుకుంది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంది. నేడు 1 శాతం లాభపడి రూ.2,051 వద్ద ముగిసింది.

ఐటీ స్టాక్స్ అదుర్స్

ఐటీ స్టాక్స్ అదుర్స్

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 0.69 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.04 శాతం, ఇన్ఫోసిస్ 2.01 శాతం, టెక్ మహీంద్రా 3004 శాతం, విప్రో 1.69 శాతం, మైండ్ ట్రీ 0.84 శాతం, కోఫోర్జ్ 5.05 శాతానికి పెరిగింది.

శుక్రవారం సెన్సెక్స్ 41,893 పాయింట్లు, పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టం 42,274కు గతవారం మరో 381 పాయింట్ల దూరంలో నిలిచింది. ఈ రోజు సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లకు పైగా ఎగిసింది. దీంతో మరోసారి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+