దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం భారీ ఊగిసలాట మధ్య ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకొని ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. చివరకు అమ్మకాల ఒత్తిడి ఎదురు కావడంతో తిరిగి నష్టాల్లోకి వెళ్లాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద అమ్మకాలకు మొగ్గు చూపారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భణం, ద్రవ్యపరపతి విధానాన్ని కఠినతరం చేయడం, మందగమన సూచనలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, చైనాలో కఠిన లాక్ డౌన్ ఆంక్షలు సూచీలపై ప్రభావం చూపాయి.
సెన్సెక్స్ ఉదయం 54,309 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,226 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 54,857 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 105 పాయింట్లు ఎగిసి 54,365 పాయింట్ల వద్ద, నిఫ్టీ 61.80 పాయింట్లు ఎగిసి 16,240 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ మార్కెట్లు ముగిసే సమయానికి నేడు 601 పైసలు క్షీణించి రూ.77.50కు పడిపోయింది.

మెటల్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్, ఐటీ, రియాల్టీ సూచీలు 1 శాతం నుండి 5 శాతం మేర క్షీణించాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, హెచ్‌యూఎల్, ఏషియన్ పేయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, అల్ట్రా టెక్ సిమెంట్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. కోల్ ఇండియా, టాటా స్టీల్, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యు, హిండాల్కో టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications