ముంబై: గతవారం టాప్ టెన్ కంపెనీల్లోని ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.81,251 కోట్లు పెరిగింది. ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. గతవారం బీఎస్ఈ 30 స్టాక్ సూచీ 424.11 పాయింట్లు లేదా 0.86 శాతం ఎగిసింది. కాగా, అంతకుముందు వారం టాప్ 10 కంపెనీల్లోని ఏడింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.62 లక్షల కోట్లు పెరిగింది. గత వారం నష్టపోయిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ మాత్రమే ఉన్నాయి.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
టాటా కన్సల్టెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.34,623.12 కోట్లు ఎగిసి రూ.11,58,542.89 కోట్లకు చేరుకుంది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.13,728.03 కోట్లు ఎగిసి రూ.4,50,310.13 కోట్లుగా ఉంది.
HDFC ఎం-క్యాప్ రూ.13,728.03 కోట్లు పెరిగి రూ.4,50,310.13 కోట్లుగా నమోదయింది.
కొటక్ మహీంద్రా మార్కెట్ క్యాప్ రూ.6,213.06 పెరిగి రూ.3,52,756.84 కోట్లుగా నమోదయింది.
ICICI మార్కెట్ క్యాప్ రూ.4,428.5 కోట్లు ఎగిసి రూ.4,19,776.85 కోట్లుగా ఉంది.
SBI మార్కెట్ క్యాప్ గతవారం రూ.4,239.2 కోట్లు పెరిగి రూ.3,19,679.59 కోట్లుగా నమోదయింది.
బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.2,797.59 కోట్లు పెరిగి రూ.3,31,436.67 కోట్లకు చేరుకుంది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.1,323.64 కోట్లు పెరిగి రూ.7,80,174.61 కోట్లుగా నమోదయింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్
దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ మాత్రం భారీగా క్షీణించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.40,033.57 కోట్లు తగ్గి రూ.12,24,336.42 కోట్లకు చేరుకుంది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.639.11 కోట్లు క్షీణించి రూ.5,76,228.85 కోట్లుగా నమోదయింది.

టాప్ 10 కంపెనీలు
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాత టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications