టాప్ 10లోని ఆరు కంపెనీలు మార్కెట్ క్యాప్ రూ.1.11 లక్షల కోట్లు జంప్, టీసీఎస్, ఇన్ఫోసిస్ అదుర్స్
వ్యాల్యూపరంగా టాప్ 10లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,11,220.5 కోట్లు పెరిగింది. అంతకుముందు 4 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.68,458 కోట్లు పెరిగింది. ఇప్పుడు అంతకుమించి వృద్ధి నమోదు చేసింది. గతవారం టీసీఎస్, ఇన్ఫోసిస్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. వీటితో పాటు HDFC బ్యాంకు, HDFC, ఐసీఐసీఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచీలు కూడా పెరిగాయి. గతవారం నష్టపోయిన స్టాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూని లీవర్స్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
- గతవారం టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,961.06 కోట్లు ఎగిసి రూ.12,50,538.30 కోట్లకు చేరుకుంది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.29,807.59 కోట్లు పెరిగి రూ.6,70,915.93 కోట్లకు చేరుకుంది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.19,838.88 కోట్లు రూ.8,36,426.69 కోట్లు పెరిగింది.
- SBI మార్కెట్ క్యాప్ రూ.14,234.76 కోట్లు ఎగిసి రూ.3,82,642.72 కోట్లుగా నమోదయింది.
- ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,775.99 కోట్లు పెరిగి రూ.4,49,166.77 కోట్లుగా ఉంది.
- HDFC మార్కెట్ క్యాప్ రూ.3,602.22 కోట్లు పెరిగి రూ.4,52,778.40 కోట్లుగా నమోదయింది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.76,548.77 కోట్లు క్షీణించి 13,34,009.02 కోట్లుగా ఉంది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,424.7 కోట్లు పెరిగి రూ.5,75,449.55 కోట్లుగా నమోదయింది.
- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.5,084.82 కోట్లు ఎగిసి రూ.3,43,934.41 కోట్లుగా ఉంది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.763.55 కోట్లు పెరిగి రూ.3,66,662.44 కోట్లకు చేరుకుంది.

టాప్ 10 కంపెనీలు ఇలా..
మార్కెట్ క్యాప్‌పరంగా టాప్ టెన్ కంపెనీల వ్యాల్యూ TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC, ICICI బ్యాంకు, SBI, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి. 30 షేర్ సెన్సెక్స్‌లో బీఎస్ఈ 580.59 పాయింట్లు లేదా 1.10 శాతం ఎగిసింది.


Click it and Unblock the Notifications