ముంబై: టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.5 లక్షల కోట్లు పెరిగింది. అంతకుముందు వారం మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా ఆరు సెషన్లలో నష్టపోవడంతో అప్పుడు రూ.3.96 లక్షల కోట్లు నష్టపోగా. గతవారం మాత్రం భారీగా లాభపడింది. బడ్జెట్ నేపథ్యంలో వరుసగా ఐదు సెషన్లు మార్కెట్ లాభపడింది. దీంతో సెన్సెక్స్ 46వేల పాయింట్ల నుండి 51వేల పాయింట్ల సమీపానికి ఎగబాకింది. గతవారం టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్‌తో పాటు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.200 లక్షల కోట్లకు చేరుకుంది.

రూ.5,13,532 కోట్లు జంప్
టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5,13,532.5 కోట్లు పెరిగింది. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా ఎగిశాయి. గతవారం సెన్సెక్స్ 4,445.86 పాయింట్లు లేదా 9.60 శాతం లాభపడ్డాయి. 30 షేర్ బీఎస్ఈ సూచీ 51,000 పాయింట్లను క్రాస్ చేసినప్పటికీ దానిని నిలుపుకోలేదు. అయినప్పటికీ 4500 పాయింట్ల మేర లాభపడింది. గతవారం భారీగా లాభపడిన వాటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉంది. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉంది.

బ్యాంకింగ్ స్టాక్స్ జంప్
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,13,516.92 కోట్లు పెరిగి రూ.8,79,735.51 కోట్లకు చేరుకుంది.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) మార్కెట్ క్యాప్ రూ.99,063.86 కోట్లు పెరిగి రూ.3,50,781.86 కోట్లకు చేరుకుంది. ఎస్బీఐ షేర్లు చివరి సెషన్లో ఏకంగా 11 శాతానికి పైగా ఎగిసింది.
HDFC ఎం-క్యాప్ రూ.61,836.61 పెరిగి రూ.4,89,877.33 కోట్లకు చేరుకుంది.
ICICI బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.53,606.61 కోట్లు ఎగిసి రూ.4,24,379.96 కోట్లకు చేరుకుంది.
కొటక్ మహీంద్రా బ్యాంకు రూ.53,395.91 కోట్లు పెరిగి రూ.3,92,741.04 కోట్లకు చేరుకుంది.

ఇవి కూడా జంప్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంపద రూ.51,254.37 కోట్లు పెరిగి రూ.12,19,708.39 కోట్లకు చేరుకుంది.
బజాజ్ ఫైనాన్స్ రూ.48,375.71 కోట్లకు పెరిగి రూ.3,33,758.06 కోట్లకు చేరుకుంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాప్ రూ.16,942.01 కోట్లు పెరిగి రూ.11,85,021.85 కోట్లుగా నమోదయింది.
ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.13,907.56 కోట్లు పెరిగి రూ.5,41,947.58 కోట్లకు చేరుకుంది.
హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.1,632.94 కోట్లు పెరిగి రూ.5,33,431.50 కోట్లకు పెరిగింది.
టాప్ 10 కంపెనీలు వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications