For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పదింట 6 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.18 లక్షల కోట్లు జంప్

|

టాప్ టెన్‌లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.18 లక్షల కోట్లు పెరిగింది. అక్షరాలా రూ.1,18,383.07 కోట్లు ఎగిసింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అధికంగా పెరిగింది. గతవారం 30 షేర్ బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 619.07 పాయింట్లు లేదా 1.03 శాతం లాభపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, HDFC, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు భారీగా లాభపడగా, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాల్లో ముగిశాయి. అంతకుముందు వారం కూడా ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేన్ గతవారం రూ.1.18 లక్షల కోట్లు పెరిగింది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) భారీ లాభాలు నమోదు చేయడంతో ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ అక్షరాలు రూ.1,18,930.01 కోట్లు పెరిగింది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్

వీటి మార్కెట్ క్యాప్ జంప్

- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.59,437.12 కోట్లు ఎగిసి రూ.16,44,511.70 కోట్లుకు పెరిగింది.

- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.29,690.9 కోట్లు లాభపడి రూ.7,48,580.98 కోట్లకు చేరుకుంది.

- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,187 పెరిగి రూ.5,41,557.77 కోట్లకు పెరిగింది.

- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.5,715.04 కోట్లు పెరిగి రూ.13,03,730.66 కోట్లకు పెరిగింది.

- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,301.84 కోట్లు లాభపడి రూ.4,11,183.32 కోట్లకు పెరిగింది.

- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.3,051.17 కోట్లు ఎగిసి రూ.4,57,355.51 కోట్లకు పెరిగింది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్

వీటి మార్కెట్ క్యాప్ డౌన్

- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,545.39 కోట్లు తగ్గి రూ.8,60,436.44 కోట్లుగా నమోదయింది. ఈ బ్యాంకు మార్కెట్ క్యాప్ అంతకుముందు మొదటిసారి రూ.9 లక్షల కోట్లు దాటింది.

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రూ.17,135.26 కోట్లు నష్టపోయి రూ.4,56,270.76 కోట్లకు తగ్గింది.

- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.3,912.07 కోట్లు నష్టపోయి రూ.5,65,546.62 కోట్లకు చేరుకుంది.

- ఐసీఐసీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.3,810.99 కోట్లు తగ్గి రూ.5,39,016.40 కోట్లకు పడిపోయింది.

టాప్ టెన్

టాప్ టెన్

టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.

English summary

పదింట 6 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.18 లక్షల కోట్లు జంప్ | Market cap of six of top 10 most valued firms jumps over Rs 1.18 lakh crore

The market capitalisation (m-cap) of six of the top 10 most valued companies jumped to Rs 1,18,383.07 crore last week, with substantial contribution from Reliance Industries Ltd.
Story first published: Sunday, November 14, 2021, 17:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X