టాప్ 10లోని నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.65,464 కోట్లు ఎగిసింది. భారతీ ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా లాభపడిన స్టాక్స్‌గా నిలిచాయి. టాప్ టెన్‌లోని ఐదు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతకుముందు వారం రూ.62,508 కోట్లు పెరిగింది. ఆ వారం లాభపడిన స్టాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందు ఉంది. అంతకంటే ముందువారం టాప్ 10 మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీల్లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,93,804.34 కోట్లు పెరిగింది. గత రెండు వారాలుగా మాత్రం రూ.60వేల కోట్లలోనే పెరుగుతోంది. సెన్సెక్స్ గతవారం 59,000 మార్కును చేరుకొని, సరికొత్త గరిష్టాన్ని తాకింది. చివరి సెషన్‌లో నష్టపోయినప్పటికీ 59,000 మార్కును నిలబెట్టుకుంది. 52 వారాల గరిష్టం 59,737 పాయింట్లు కాగా, కనిష్టం 36,495 పాయింట్లు. అంటే ఈ కాలంలో 23వేల పాయింట్ల వరకు ఎగిసింది.

710 పాయింట్లు జంప్
గతవారం 30 షేర్ల బీఎస్ఈ బెంచ్‌మార్క్ 710 పాయింట్లు లేదా 1.21 శాతం లాభపడింది. మార్కెట్ బెంచ్‌మార్కెట్ సెన్సెక్స్ గత గురువారం మొదటిసారి 59,000 పాయింట్లను దాటింది. టాప్ 10లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.43,746.79 కోట్లు క్షీణించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ మాత్రం లాభపడ్డాయి. వీటి మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
- భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.22,984.14 కోట్లు ఎగిసి రూ.3,99,901.97 కోట్లకు చేరుకుంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.19,500.28 కోట్లు ఎగిసి రూ.4,05,221.99 కోట్లకు చేరుకుంది.
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.14,315.33 కోట్లు క్షీణించి రూ.14,16,903.13 కోట్లకు చేరుకుంది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,664.66 కోట్లు క్షీణించి రూ.8,76,597.86 కోట్లకు పెరిగింది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,219.75 కోట్లు తగ్గి రూ.15,15,380.48 కోట్లకు క్షీణించింది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.20,605.92 కోట్లు తగ్గి రూ.6,39,335.53 కోట్లకు క్షీణించింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.576.19 కోట్లు తగ్గి రూ.5,10,550.29 కోట్లకు పడిపోయింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మరోసారి క్షీణించింది. గతవారం రూ.212.1 కోట్లు క్షీణించి రూ.7,17,427.09 కోట్లకు తగ్గింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.90.54 కోట్లు తగ్గి రూ.4,48,292.54 కోట్లకు చేరుకుంది.
- ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.42.29 కోట్లు తగ్గి రూ.4,99,176.68 కోట్లకు చేరుకుంది.
గతవారం మార్కెట్లు ఐదు సెషన్లు వర్క్ చేశాయి. అంతకుముందు వారం వినాయక చవితి సందర్భంగా శుక్రవారం సెలవు ఉండటంతో నాలుగు సెషన్‌లు పని చేసాయి. టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications