టాప్ 10లోని 5 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.42 లక్షల కోట్లు డౌన్
టాప్ టెన్లోని ఐదు కంపెనీల మార్కెట్ వ్యాల్యుయేషన్ గతవారం రూ.1.42 లక్షల కోట్లు తగ్గింది. అక్షరాలా రూ.1,42,880.11 కోట్ల సంపద ఇన్వెస్టర్లు కోల్పోయారు. హిందూస్తాన్ యూనీలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారీగా నష్టపోయాయి. గతవారం 30 షేర్ బీఎస్ఈ బెంచ్మార్క్ సెన్సెక్స్ 484.33 పాయింట్లు లేదా 0.79 శాతం నష్టపోయింది. సోమవారం మాత్రమే లాభాల్లో ముగిసిన మార్కెట్లు, ఆ తర్వాత మంగళవారం నుండి శుక్రవారం వరకు వరుసగా నష్టపోయాయి.
అంతకుముందువారం టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతకుముందువారం రూ.1,52,355.03 కోట్లు పెరిగింది. అంతకుముందువారం 61,300కు పైన ముగిసింది. సెన్సెక్స్ గత సోమవారం 460 పాయింట్లు లాభపడి 61,765 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ ఆ తర్వాత వరుసగా నష్టపోయింది. దీంతో 61వేల పై నుండి 60,000 దిగువకు వచ్చింది.
ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.45,523.33 కోట్లు క్షీణించి రూ.5,76,836.40 కోట్లకు తగ్గింది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.45,126.6 కోట్లు నష్టపోయి రూ.16,66,427.95 కోట్లుకు పడిపోయింది.
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.41,151.94 కోట్లు క్షీణించి రూ.12,94,686.48 కోట్లకు తగ్గింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.8,890.95 కోట్లు తగ్గి రూ.4,65,576.46 కోట్లకు చేరుకుంది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,187.29 కోట్లు క్షీణించి రూ.9,31,371.72 కోట్లకు పడిపోయింది. ఈ బ్యాంకు మార్కెట్ క్యాప్ అంతకుముందు వారం తొలిసారి రూ.9 లక్షల కోట్లు దాటింది.
ఈ స్టాక్స్ జంప్
- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,747.78 కోట్లు పెరిగి రూ.4,30,558.09 కోట్లకు చేరుకుంది.
- ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.22,248.14 కోట్లు పెరిగి రూ.5,26,497.27 కోట్లకు ఎగిసింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,015.22 పెరిగి రూ.5,24,877.06 కోట్లకు పెరిగింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రూ.11,111.14 కోట్లు లాభపడి రూ.4,48,863.34 కోట్లకు చేరుకుంది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.1,717.96 కోట్లు ఎగిసి రూ.7,29,410.37 కోట్లకు చేరుకుంది.
టాప్ 10
గతవారం మార్కెట్లు ఐదు సెషన్లు వర్క్ చేశాయి. టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.