ముంబై: గతవారం టాప్ 10 కంపెనీల్లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,23,670.47 కోట్లు నష్టపోయింది. గతవారం బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 654.54 పాయింట్లు లేదా 1.26 శాతం ఎగిసింది. గతవారం కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే లాభపడ్డాయి. భారీగా నష్టపోయిన కంపెనీల్లో దేశీయ రెండో అతిపెద్ద కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉంది. బడ్జెట్ అనంతరం మార్కెట్లు వరుసగా లాభపడ్డాయి. దీంతో గతవారం ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపారు.

నష్టపోయిన కంపెనీలు
భారీగా నష్టపోయిన కంపెనీల్లో ఐటీ దిగ్గజం టీసీఎస్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు వంటివి ఉన్నాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.44,672.14 కోట్లు క్షీణించి రూ.11,52,770.11 కోట్లకు పడిపోయింది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.23,964.99 కోట్లు పడిపోయి రూ.8,47,754.65 కోట్లకు పతనమైంది.
ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,146.38 కోట్లు పతనమై రూ.4,31,177.44 కోట్లకు తగ్గింది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.14,273.56 కోట్లు క్షీణించి రూ.5,12,473.46 కోట్లకు చేరింది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.9,408.05 కోట్లు తగ్గి రూ.4,92,908.61 కోట్లు పడిపోయింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.7,735.21 కోట్లు తగ్గి రూ.5,50,100.64 కోట్లకు చేరింది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.4,667.04 కోట్లు క్షీణించి రూ.3,31,365.79 కోట్లుగా నమోదయింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.2,803.1 కోట్లు తగ్గి రూ.3,83,777.06 కోట్లుగా ఉంది.

రిలయన్స్, ఎస్బీఐ జంప్
దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.24,914 కోట్లు పెరిగి రూ.13,18,952.34 కోట్లకు చేరుకుంది.
ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.5,488.63 కోట్లు పెరిగి రూ.3,56,404.36 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రెండు వారాలుగా పెరుగుతోంది. గతవారమే రిలయన్స్ షేర్ రూ.2000ను దాటింది.

టాప్ టెన్ కంపెనీలు
టాప్ 10 మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీలు వరుసగా రిలయన్స్, TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు, SBI, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ గతవారం రూ.13 లక్షలకోట్లను క్రాస్ చేయగా, టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.12 లక్షల కోట్ల దిగువకు వచ్చింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications