టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,52,355.03 కోట్లు పెరిగింది. టాప్ గెయినర్స్‌గా HDFC బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లు నిలిచాయి. గతవారం బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 1,246.89 పాయింట్లు లేదా 2.07 శాతం లాభపడింది. అంతకుముందువారం ఎనిమిది కంపెనీల ఎం-క్యాప్ రూ.2.32 లక్షల కోట్లు పెరిగింది. ఆ వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. గతవారం సెన్సెక్స్ 1246 పాయింట్లు లాభపడగా, అంతకుముందు వారం కూడా 1293 డాలర్లు లాభపడింది. బెంచ్ మార్క్ సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 61,000 మార్కును క్రాస్ చేసింది. అంతకుముందువారం సెన్సెక్స్ 60,000 మార్కుకు చేరుకుంది. అయితే ఓ సమయంలో 60,000 దిగువకు పడిపోయినప్పటికీ, మళ్లీ కోలుకొని 61,000 మార్కును తొలిసారి దాటింది. దసరా పర్వదినం సందర్భంగా శుక్రవారం మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. గతవారం మార్కెట్లు నాలుగు రోజులు వర్క్ చేశాయి.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.46,348.47 కోట్లు పెరిగి రూ.9,33,559.01 కోట్లకు పెరిగింది. ఈ బ్యాంకు మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.9 లక్షల కోట్లు దాటింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,272.73 పెరిగి రూ.4,37,752.20 కోట్లకు చేరుకుంది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,384.38 కోట్లు ఎగిసి రూ.17,11,554.55 కోట్లుగా నమోదయింది.
- ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.16,860.76 కోట్లు పెరిగి రూ.5,04,249.13 కోట్లకు ఎగిసింది.
- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,944.02 కోట్లు తగ్గి రూ.3,99,810.31 కోట్లకు చేరుకుంది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.7,526.82 కోట్లు ఎగిసి రూ.4,74,467.41 కోట్లకు చేరుకుంది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,997.15 కోట్లు పెరిగి రూ.6,22,359.73 కోట్లకు పెరిగింది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,19,849.27 కోట్లు క్షీణించి రూ.13,35,838.42 కోట్లకు తగ్గింది. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో గత సోమవారం ఒక్కరోజే ఆరు శాతం నష్టపోయింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మరోసారి తగ్గింది. గతవారం తగ్గిన ఈ స్టాక్ ఈ వారమూ తగ్గింది. అంతకుముందు నాలుగు వారాలుగా పైకీ, కిందకు కదలుతోంది. కానీ ఈసారి రెండోసారి కూడా తగ్గింది. అంతకుముందువారం రూ.24,857.35 తగ్గిన మార్కెట్ క్యాప్ గతవారం రూ.3,414.71 క్షీణించి రూ.7,27,692.41 వద్ద ముగిసింది.

టాప్ 10
గతవారం మార్కెట్లు నాలుగు సెషన్లు వర్క్ చేశాయి. టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications