ముంబై: టాప్ 10 కంపెనీల్లోని ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా పెరిగింది. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఎగిసింది. కేవలం బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రం క్షీణించింది. ఆరు సంస్థల మార్కెట్ క్యాప్ రూ.1.53 లక్షల కోట్లు పెరిగింది. గతవారం సూచీలు భారీగానే లాభపడ్డాయి. మార్కెట్లు గతవారంతో వరుసగా ఆరు వారాలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈ వారం 46వేల పాయింట్లను క్రాస్ చేసింది.

వెయ్యి పాయింట్లకు పైగా జంప్
గతవారం సెన్సెక్స్ 1,019.46 పాయింట్లు లేదా2.26 శాతం లాభపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ ఇప్పటికీ రూ.13 లక్షల కోట్లకు దిగువనే ఉంది. లాభపడిన స్టాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL), టీసీఎస్, హిందూస్తాన్ యూనీలీవర్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్ర బ్యాంకు, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మాత్రం నష్టాల్లో ముగిశాయి. గతవారం 8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,53,041.36 కోట్లు ఎగిసింది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.37,434.4 కోట్లు పెరిగి రూ.12,71,438.23కు చేరుకుంది.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21,557.45 కోట్లు పెరిగి రూ.10,44,457.52 కోట్లకు చేరుకుంది. గతంలో రిలయన్స్, టీసీఎస్ మధ్య మార్కెట్ క్యాప్ పరంగా రూ.5 లక్షల కోట్ల వరకు తేడా ఉంది. ఇప్పుడు రూ.2.25 లక్షల కోట్ల వరకు ఉంది.
కొటక్ మహీంద్ర బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.14,798.9 కోట్లు పెరిగి రూ.3,80,247.43 కోట్లుగా ఉంది.
ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.12,096.98 కోట్లు లాభపడి రూ.4,95,401.04 కోట్లకు చేరుకుంది.
భారతీ ఎయిర్ టెల్ ఎంక్యాప్ రూ.5,537.39 కోట్లు ఎగిసి రూ.2,74,987.37 కోట్లుగా ఉంది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ ఇలా..
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,031.76 కోట్లు పెరిగి రూ.3,55,529.51 కోట్లుగా నమోదయింది.
హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాప్ రూ.8,988.46 కోట్లు పెరిగి రూ.4,13,181.19 కోట్లకు చేరుకుంది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.1,919.24 కోట్లు తగ్గి రూ.2,91,839.07 కోట్లుగా నమోదయింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎం-క్యాప్ రూ.1,624.45 కోట్లు తగ్గి రూ.7,61,122.91 కోట్లుగా ఉంది.
మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 10 కంపెనీలు వరుసగా... రిలయన్స్, TCS, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్రా బ్యాంకు, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications