టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2,48,372.97 కోట్లు తగ్గింది. గతవారం బలహీనమైన మార్కెట్ ట్రెండ్ కారణంగా సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. హెవీ వెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు వంటి దిగ్గజాలు భారీగా నష్టపోయాయి. గతవారం సెన్సెక్స్ 2041 పాయింట్లు లేదా 3.72 శాతం నష్టపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, HDFC, భారతీ ఎయిర్టెల్ నష్టపోగా, హిందూస్తాన్ యూనీలీవర్, కొటక్ మహీంద్రా మాత్రమే లాభపడ్డాయి.

మార్కెట్ క్యాప్ డౌన్
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.1,30,627.7 కోట్లు క్షీణించి రూ.16,42,568.98 కోట్లకు తగ్గింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాప్ రూ.35,073.72 కోట్లు తగ్గి రూ.3,97,189.84 కోట్లకు పడిపోయింది.
ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ.29,279.72 కోట్లు క్షీణించి రూ.4,70,856.80 కోట్లుగా నమోదయింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,869.36 కోట్లు తగ్గి రూ.6,32,432.92 కోట్లుగా నమోదయింది.
టాటా కన్సల్టెన్సీ మార్కెట్ క్యాప్ రూ.7,153.45 కోట్లు క్షీణించి రూ.12,48,998.89 కోట్లుగా నమోదయింది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.3,408.48 కోట్లు తగ్గి రూ.3,86,636.58 కోట్లకు పడిపోయింది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
అదే సమయంలో హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,514.42 కోట్లు క్షీణించి రూ.5,15,582.56 కోట్లకు పెరిగింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.1,231.33 కోట్లు ఎగిసి రూ.3,53,200.33 కోట్లకు చేరుకుంది.

టాప్ టెన్
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, HDFC, భారతీ ఎయిర్టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications