10 మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీల్లో తొమ్మిదింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.3,01,145.46 కోట్లు పెరిగింది. గతవారం భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీగా లాభపడింది. గతవారం సెన్సెక్స్ 1,812 పాయింట్లు (4.68 శాతం) లాభపడింది. టాప్ టెన్ కంపెనీల్లో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్లకు పైగా పెరిగింది. గత శుక్రవారంతో మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిశాయి. అంతకుముందు వారం కూడా టీసీఎస్ భారీ టాప్ గెయినర్‌గా నిలిచింది. వరుసగా రెండోవారం భారీ లాభాలు ఆర్జించింది.

టీసీఎస్ అదుర్స్..
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,09,644.68 కోట్లు ఎగిసి రూ.10,56,277.53 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత రూ.10 లక్షల కోట్ల మార్క్ దాటిన భారత కంపెనీ టీసీఎస్. అంతేకాదు, ఇటీవలి వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచ అగ్రగామిగా ఉన్న యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టింద టీసీఎస్. ఇప్పుడు టీసీఎస్ ప్రపంచ వ్యాల్యుబుల్ ఐటీ కంపెనీ.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.69,952.08 కోట్లు పెరిగి రూ.6,78,991.98 కోట్లకు చేరుకుంది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.38,270.81 కోట్లు పెరిగి రూ.4,71,751.13 కోట్లకు పెరిగింది.
HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,052.75 పెరిగి రూ.3,51,483.41 కోట్లకు ఎగిసింది.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,428.99 పెరిగి రూ.2,77,003.07 కోట్లుగా ఉంది.

ఎయిర్ టెల్ డౌన్
టీసీఎస్, ఇన్ఫోసిస్‌తో పాటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాప్ రూ.11,736.6 కోట్లకు పెరిగి రూ.2,32,289.73 కోట్లకు చేరుకుంది.
హిందూస్తాన్ యూనీ లీవర్ మార్కెట్ క్యాప్ రూ.10,291.06 కోట్లు లాభపడి రూ.5,02,534.84 కోట్లుగా ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంక్యాప్ రూ.5,849.16 లాభపడి రూ.15,10,436.34 కోట్లుగా ఉంది. కొటక్ మహీంద్ర బ్యాంకు ఎం-క్యాప్ రూ.2,919.33 కోట్లు పెరిగి రూ.2,61,265.33 కోట్లుగా ఉంది.
భారతీ ఎయిర్‌టెల్ ఎం-క్యాప్ మాత్రమే గతవారం క్షీణించింది. రూ.3,928 కోట్లు క్షీణించి రూ.2,31,943.02 కోట్లకు పరిమితమైంది.

టాప్ 10 కంపెనీలు
ర్యాంకింగ్స్ పరంగా టాప్ టెన్ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానాన్ని కొనసాగిస్తోంది. రిలయన్స్ తర్వాత టీసీఎస్ రూ.10 లక్షల కోట్లను దాటిన రెండో సంస్థగా నిలిచింది. ఆ తర్వాత HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు, HCL టెక్నాలజీస్, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలు ఉన్నాయి.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications