టాప్ టెన్‌లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2.48 లక్షల కోట్లు పడిపోయింది. అంతకుముందు నెలలో అక్షరాలా రూ.1,42,880.11 కోట్ల సంపద ఇన్వెస్టర్లు కోల్పోయారు. వరుసగా రెండో వారం మార్కెట్లు నష్టాల్లో ముగిసి, ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంకులు భారీగా నష్టపోయాయి. గతవారం 30 షేర్ బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 1,514.69 పాయింట్లు లేదా 2.49 శాతం నష్టపోయింది.
వరుసగా రెండు రోజులు లాభాల్లో కనిపించినప్పటికీ, ఆ తర్వాత మూడు రోజులు భారీగా నష్టపోయాయి. ఒకరోజు ఏకంగా 1100 పాయింట్లకు పైగా నష్టపోయింది. అంతకుముందువారం సెన్సెక్స్ 484.33 పాయింట్లు లేదా 0.79 శాతం నష్టపోయింది. ఈ నెలలో 62వేల పాయింట్లు క్రాస్ చేసి, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ గతవారం 60,000 దిగువకు వచ్చింది.

ఈ కంపెనీలు డౌన్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.56,741.2 కోట్లు నష్టపోయి రూ.16,09,686.75 కోట్లుకు పడిపోయింది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.54,843.3 కోట్లు క్షీణించి రూ.8,76,528.42 కోట్లకు పడిపోయింది. ఈ బ్యాంకు మార్కెట్ క్యాప్ అంతకుముందు మొదటిసారి రూ.9 లక్షల కోట్లు దాటింది.
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.37,452.9 కోట్లు క్షీణించి రూ.12,57,233.58 కోట్లకు తగ్గింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.27,678.78 కోట్లు నష్టపోయి రూ.7,01,731.59 కోట్లకు తగ్గింది.
- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.27,545.09 కోట్లు తగ్గి రూ.4,03,013 కోట్లకు పడిపోయింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.18,774.8 కోట్లు తగ్గి రూ.4,46,801.66 కోట్లకు క్షీణించింది.

ఐసీఐసీఐ జంప్
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.45,523.33 కోట్లు క్షీణించి రూ.5,76,836.40 కోట్లకు తగ్గింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,659.37 తగ్గి రూ.5,14,217.69 కోట్లకు పడిపోయింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రూ.490.86 కోట్లు నష్టపోయి రూ.4,48,372.48 కోట్లకు తగ్గింది.
- కేవలం ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే పెరిగింది. గతవారం ఈ స్టాక్ లాభపడటంతో ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ.30,010.44 కోట్లు పెరిగి రూ.5,56,507.71 కోట్లకు ఎగిసింది.

టాప్ టెన్ కంపెనీలు
గతవారం మార్కెట్లు ఐదు సెషన్లు వర్క్ చేశాయి. టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications