ముంబై: టాప్ టెన్‌లోని 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,38,976.88 కోట్లు క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్స్ భారీగా దెబ్బతిన్నాయి. అంతకుముందు ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.72,442 కోట్లు పెరగగా, దానికంటే ముందు వారం టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.94 లక్షల కోట్లు పెరిగింది. ఈసారి మాత్రం రూ.72వేల కోట్లు పెరిగింది. వరుస వారాల్లో లాభాల్లో ముగిసినప్పటికీ, గతవారం మాత్రం క్షీణించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 30 షేర్ ఇండెక్స్ గతవారం 933.84 పాయింట్లు లేదా 1.83 శాతం క్షీణించింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
గతవారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ లాభాల్లో ముగిశాయి. ఈ సూచీలు లాభాలతో వారాన్ని ముగించాయి.
హిందూస్తాన్ యూనీ లీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.25,294.91 కోట్లు పెరిగి రూ.5,43,560.03 కోట్లకు చేరుకుంది.
టీసీఎస్ ఎం-క్యాప్ రూ.2,348.9 కోట్లు ఎగిసి రూ.11,33,111.91 కోట్లకు చేరుకుంది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతంలో ఓసారి రూ.12 లక్షల కోట్లు దాటింది. ఆ తర్వాత ఈ మార్కు దిగువకు వచ్చింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.35,976.08 కోట్లు తగ్గి రూ.13,19,808.41 కోట్లకు చేరుకుంది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.30,061.52 కోట్లు తగ్గి రూ.8,25,024.73 కోట్లకు పడిపోయింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.20,787.22 కోట్లు క్షీణించి రూ.3,62,953.84 కోట్లకు దిగి వచ్చింది.
ICICI బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.18,172.67 కోట్లు తగ్గి రూ.4,05,561.24 కోట్లుగా ఉంది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.12,460.17 కోట్లు తగ్గి రూ.5,73,104.03 కోట్లుగా ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ రూ.9,013.86 కోట్లు క్షీణించి రూ.3,31,192.33 కోట్లుగా ఉంది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.6,313.77 కోట్లు తగ్గి రూ.4,56,678.43 కోట్లకు తగ్గింది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.6,191.59 కోట్లు క్షీణించి రూ.3,28,524.59 కోట్లుగా ఉంది.

టాప్ 10 వరుసగా
టాప్ టెన్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications