10 మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీల్లో ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,45,194.57 కోట్ల మేర పెరిగింది. ఇందులో టాటా కన్సల్టెన్సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. గతవారం అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా మార్కెట్లు 4 రోజులు మాత్రమే ఉన్నాయి. సోమవారం నుండి గురువారం వరకు మార్కెట్లు కొనసాగాయి. శుక్రవారం మార్కెట్ క్లోజ్ అయింది. గతవారం మార్కెట్లు భారీగా లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,308.39 పాయింట్ల మేర లాభపడింది.

ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ జూమ్
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రూ.37,692.7 కోట్లు ఎగిసి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,46,632.85 కోట్లుగా ఉంది. టాప్ 10 కంపెనీల్లో గతవారం ఎక్కువగా లాభపడింది టీసీఎస్.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.34,425.67 కోట్లు పెరిగి రూ.6,09,039.90 కోట్లకు ఎగిసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.15,789.36 ఎగిసి రూ.15,04,587.18 కోట్లకు పెరిగింది.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.14,244.15 కోట్లు పెరిగి రూ.2,54,574.08 కోట్లకు చేరుకుంది.
కొటక్ మహీంద్ర బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.11,053.88 కోట్లు పెరిగి రూ.2,58,346 కోట్లకు ఎగిసింది.
హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.4,064.73 కోట్లు పెరిగి రూ.4,92,243.78 కోట్లు పెరిగింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.2,832.51 కోట్లు పెరిగి రూ.4,33,480.32 కోట్లకు చేరుకుంది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్
టాప్ 10లో రెండు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణించింది.
భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.4,009.84 కోట్లు క్షీణించి రూ.2,35,871.02 కోట్లకు తగ్గింది.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.4,002.66 కోట్లు క్షీణించి రూ.2,20,553.13 కోట్లకు పడిపోయింది.

టాప్ 10 కంపెనీలు వరుసగా..
టాప్ 10 కంపెనీల్లో మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు ఉంది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్ర బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications