గతవారం టాప్ టెన్‌లోని 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,21,555.61 క్షీణించింది. అంతర్జాతీయ అననుకూలతలు, ప్రాఫిట్ బుకింగ్ వంటి వివిధ అంశాల కారణంగా సూచీలు భారీగా నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ క్షీణించింది. అత్యధిక నష్టాలను చూసిన వాటిలో హెవీ నెయిట్స్ ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

భారీ నష్టాల్లో క్లోజ్
గతవారం 30 షేర్ సెన్సెక్స్ 1141.78 పాయింట్లు లేదా 195 శాతం పతనమైంది. కేవలం చివరి సెషన్‌లోనే 714 పాయింట్లు క్షీణించింది. గతవారం తొలి సెషన్‌లలో భారీ లాభాలు నమోదు చేసి, 58,000 స్థాయికి వెళ్లినప్పటికీ, ఆ తర్వాత క్షీణించింది. గతవారం ఓ సమయంలో 56,000 స్థాయికి కూడా పడిపోయింది. కానీ ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నప్పటికీ మొత్తానికి నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 57,197.15 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17,171 పాయింట్ల వద్ద ముగిసింది.

రిలయన్స్, అదానీ లాభాల్లో
టాప్ టెన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రీన్ ఎనర్జీ మాత్రమే లాభాల్లో ముగిశాయి. మిగతా ఎనిమిది స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,39,357.52 కోట్లు లాభపడి 18,66,071.57 కోట్లకు పెరిగింది.
- అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,698.89 కోట్లు క్షీణించి రూ.4,51,749.88 కోట్లకు పెరిగింది.

ఈ స్టాక్స్ నష్టాల్లో
- నష్టపోయిన వాటిలో ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.68,548.8 కోట్లు క్షీణించి రూ.6,67,062.55 కోట్లకు తగ్గింది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.60,536.97 కోట్లు తగ్గి రూ.7,51,801.60కు తగ్గింది.
- భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.30,127.49 కోట్లు క్షీణించి రూ.4,05,723.51 కోట్లకు తగ్గింది.
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాప్ రూ.18,094.01 కోట్లు తగ్గి రూ.13,21,594.47 కోట్లకు తగ్గింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాప్ రూ.15,261.09 కోట్లు క్షీణించి రూ.4,46,587.56 కోట్లకు తగ్గింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.13,264.96 కోట్లు క్షీణించి రూ.4,30,420.83 కోట్లకు తగ్గింది.
- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,376.97 కోట్లు తగ్గి రూ.5,19,362.62 కోట్లకు క్షీణించింది.
- హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,345.32 కోట్లు తగ్గి రూ.5,00,392.45 కోట్లకు తగ్గింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications