టాప్ టెన్ లిస్టెడ్ కంపెనీల్లోని ఏడింటి మార్కెట్ క్యాపిలైజేషన్ గత వారం రూ.67,622 కోట్లు పెరిగింది. ఇందులో ప్రయివేటురంగ బ్యాంకులు హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల ఎం-క్యాప్ భారీగా పెరిగింది. గత వారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), HDFC బ్యాంకు, HDFC, కొటక్ మహీంద్ర బ్యాంకు, ICICI బ్యాంకు, ఐటీసీ, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్(HUL) లాభపడగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ నష్టపోయింది.

కంపెనీల ఎం-క్యాప్ పెరిగిందిలా..
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం 28,183.55 పెరిగి రూ.5,97,051.15 కోట్లకు, ICICI బ్యాంకు ఎం-క్యాప్ రూ.21,839.67 ఎగిసి రూ.2,55,929.73 కోట్లకు, హిందూస్తాన్ యూనీ లీవర్ మార్కెట్ క్యాప్ రూ.6,848.94 కోట్లు పెరిగి రూ.5,17,641.12 కోట్లుగా, కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,241.25 ఎగిసి రూ.2,65,097.18 కోట్లుగా, HDFC ఎం-క్యాప్ రూ.1,858.87 కోట్లు పెరిగి రూ.3,22,872.98 కోట్లుగా, TCS ఎం-క్యాప్ రూ.2,157.62 పెరిగి రూ.8,43,611.13 కోట్లుగా, ITC ఎం-క్యాప్ రూ.492.18 కోట్లు పెరిగి రూ.2,42,280.13 కోట్లకు చేరుకుంది.

ఈ కంపెనీల క్యాప్ తగ్గింది
ఇక, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,507.97 కోట్లు తగ్గి రూ.13,19,705.53 కోట్లుగా, భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.4,855.45 కోట్లు పడిపోయి రూ.2,83,688.98 కోట్లుగా, ఇన్పోసిస్ రూ.1,972.11 కోట్లు పెరిగి రూ.4,04,151.80 కోట్లకు పెరిగింది.

ఈ వారం సెన్సెక్స్ అప్
గత వారం 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ 557 పాయింట్లకు పైగా లేదా 1.47 శాతం పెరిగింది. గత వారం టాప్ గెయినర్స్‌గా ప్రయివేటు రంగ రుణదాతలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ఉండటం గమనార్హం. మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్, టీసీఎస్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications