For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 10లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.32 లక్షల కోట్లు డౌన్

|

టాప్ 10లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.32 లక్షల కోట్లు క్షీణించింది. టాప్ టెన్‌లో మార్కెట్ క్యాప్ పరంగా టాప్ వన్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయింది. గతవారం సెన్సెక్స్ 1,108.25 పాయింట్లు లేదా 1.86 శాతం క్షీణించింది. రిలయన్స్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, HUL, బజాజ్ ఫైనాన్స్, HDFC నష్టాల్లో ముగియగా, కేవలం ICICI బ్యాంకు, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎస్బీఐ మాత్రమే లాభాల్లో ముగిశాయి.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్

వీటి మార్కెట్ క్యాప్ డౌన్

రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.43,491.37 కోట్లు క్షీణించి రూ.17,26,714.05 కోట్లకు తగ్గింది.

ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.27,953.78 కోట్లు తగ్గి రూ.7,35,611.35 కోట్లకు పడిపోయింది.

HDFC బ్యాంకు మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ.27,866.34 కోట్లు క్షీణించి రూ.8,12,338.57 కోట్లుగా నమోదయిది.

HDFC మార్కెట్ క్యాప్ రూ.14,631.11 కోట్లు తగ్గి రూ.4,31,028.49 కోట్లకు పడిపోయింది.

టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.9,348.88 క్షీణించి రూ.13,39,688.48 కోట్లుగా నమోదయింది.

హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.7,119.26 కోట్లు క్షీణించి రూ.5,05,737.77 కోట్లుగా నమోదయింది.

బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.2,125.05 కోట్లు తగ్గి రూ.2,125.05 కోట్లుగా నమోదయింది.

అదానీ టాప్ టెన్‌లోకి

అదానీ టాప్ టెన్‌లోకి

అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కెట్ క్యాప్ రూ.84,581.99 కోట్లు పెరిగి రూ.4,48,050.99 కోట్లకు చేరుకుంది.

ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.5,559.02 కోట్లు ఎగిసి రూ.5,29,739.59 కోట్లుగా నమోదయింది.

ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,249.45 కోట్లు ఎగిసి రూ.4,61,848.65 కోట్లుగా నమోదయింది.

టాప్ టెన్ ఇవే

టాప్ టెన్ ఇవే

టాప్ టెన్ కంపెనీలను చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు ఉన్నది. ఈ తర్వాత వరుసగా టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, HUL, ఎస్బీఐ, అదానీ గ్రీన్ ఎనర్జీ, బజాజ్ ఫైనాన్స్, HDFC ఉన్నాయి.

గతవారం మార్కెట్లు మూడు రోజులు మాత్రమే కొనసాగాయి. గురువారం మహావీర్ జయంతి, అంబేడ్కర్ జయంతి సందర్భంగా, శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు దినం.

English summary

టాప్ 10లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.32 లక్షల కోట్లు డౌన్ | market cap of 7 of top 10 firms tumbles over Rs 1.32 lakh crore

Seven of the 10 most valued firms suffered a combined erosion of Rs 1,32,535 crore in market valuation last week, with Reliance Industries emerging as the worst hit.
Story first published: Sunday, April 17, 2022, 15:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X