Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్‌వాలా దేశీయ స్టాక్ మార్కెట్లతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన గురించి తెలుసు. చివరి క్షణం వరకు బిగ్ బుల్ పేరుతో మార్కెట్లలో అనేక మందికి మార్గనిర్థేశకుడిగా నిలిచారు.
భౌతికంగా జున్‌జున్‌వాలా మన మధ్య లేనప్పటికీ ఇప్పటికీ ఆయన ఆలోచనలు అనేక మందిని ముందుకు నడిపిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఎల్లప్పుడూ ఆశాజనకమైన ధోరణిని కలిగి ఉన్న వ్యక్తులంలో రాకేష్ ఎల్లప్పుడూ ముందు వరుసలోనే నిలిచేవారు. ఇప్పటికీ ఆయన పోర్ట్ ఫోలియోను అనేక మంది ఫాలో అవుతూ ఉండటం గమనార్హం.

ఈ క్రమంలో దేశంలోని అత్యంత విశ్వసనీయమైన, విలువైన వ్యాపార సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న టాటాల గురించి మాట్లాడారు. దేశాభివృద్ధి ప్రథమంగా పనిచేసిన ఏకైక బిజినెస్ గ్రూప్ టాటాలని చెప్పుకోవచ్చు. టాటాలకు దేవుని ఆశీస్సులు ఉన్నాయని రాకేష్ అభిప్రాయపడ్డారు. తనకు జీవితంలో టాటాలు రోల్ మోడల్ అని ఇంటర్వ్యూలో వెల్లడించారు.
రతన్ టాటా, జేఆర్‌డీ టాటాలు టాటా గ్రూప్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని జున్‌జున్‌వాలా అన్నారు. వారు తమ సంపదను దాతృత్వానికి అంకితం చేశారన్నారు. బాంబేలో ఏర్పాటు చేసిన టాటా క్యాన్సర్ ఆసుపత్రి గురించి మాట్లాడుతూ.. అక్కడికి వచ్చే ప్రతి పిల్లవాడిని వారు పరీక్షిస్తారని, వైద్యం వల్ల ఆరోగ్యాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంటే దానికి ఉచితంగా వైద్యం అందిస్తారని చెప్పారు. వారికి ఇండియన్ క్యాన్సర్ సొసైటీ మందులను అందిస్తుంద వెల్లడించారు.
దేశంలోని ప్రతి జిల్లాలో, జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ ఆసుపత్రులను నెలకొల్పాలని టాటాలు కృషి చేస్తున్నారని రాకేష్ జున్‌జున్‌వాలా పేర్కొన్నారు. దేశంలో మెుదటి స్టీల్ ఫ్యాక్టరీ, మెుదటి 5 స్టార్ హోటల్, మెుదటి పవర్ ప్లాంట్, మెుదటి సాఫ్ట్ వేర్ కంపెనీ, మెుదటి కార్ కంపెనీ నుంచి ఇండియన్ ఇన్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వరకు అనేక కీలకమైన వాటిని టాటాలు తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు. ఇలా సమాజ హితం కోసం టాటాలు సంపదను సృష్టించారని, వినియోగించారని తెలిపారు. ఒక మనిషికి ఇంతకంటే మంచి ఆలోచన ఏమి ఉంటుందంటూ టాటాలు చేస్తున్న పనిని కొనియాడారు.


Click it and Unblock the Notifications