ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం(17, డిసెంబర్) భారీ లాభాల్లో ముగిశాయి. పలు దేశాల్లో కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి రావడం, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా కోలుకుంటుండటంతో ఇన్వెస్టర్లు నేడు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఫార్మా స్టాక్స్ కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో మార్కెట్లు వరుసగా ఐదవ రోజు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మొదటిసారి 13,700 పాయింట్లను తాకగా, సెన్సెక్స్ 47,000 మార్కుకు కొద్ది దూరంలో నిలిచింది.

భారీ లాభాల్లో ముగింపు
నేడు సెన్సెక్స్ 223.88 పాయింట్లు(0.48%) లాభపడి 46,890.34 పాయింట్ల వద్ద, నిఫ్టీ 58.00 పాయింట్లు(0.42%) ఎగిసి 13,740.70 పాయింట్ల వద్ద ముగిసింది. 1234 షేర్లు లాభాల్లో, 1485 షేర్లు నష్టాల్లో ముగియగా, 137 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో నేడు రూపాయి 73.58 వద్ద క్లోజ్ అయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లు పెరగడంతో రూపాయి దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. నేడు 73.53 వద్ద ప్రారంభమైంది. నేడు 73.38-73.58 మధ్య ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో HDFC 2.88 శాతం, దివిస్ ల్యాబ్స్ 2.87 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.72 శాతం, HDFC బ్యాంకు 2.20 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.52 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో 2.23 శాతం, అదాని పోర్ట్స్ 1.64 శాతం, పవర్ గ్రిడ్ కార్ప్ 1.48 శాతం, కోల్ ఇండియా 1.41 శాతం, ONGC 1.36 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.42 శాతం లాభపడగా, మిడ్ క్యాప్ సూచీలు 0.38 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.58 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.34 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.53 శాతం, నిఫ్టీ ఐటీ 0.06 శాతం, నిఫ్టీ మీడియా 1.94 శాతం, నిఫ్టీ మెటల్ 1.35 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.42 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ బ్యాంకు 0.48 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ స్టాక్స్ 1.18 శాతం, నిఫ్టీ ఫార్మా 0.44 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.59 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.52 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications