ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.19 సమయానికి సెన్సెక్స్ 254.11 పాయింట్లు(0.55) లాభపడి 46698.29 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 71.60(0.53) పాయింట్లు ఎగిసి 13672.70 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు మంచి లాభాలు నమోదు చేశాయి. మూడు రోజుల క్రితం సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటోంది. తాజాగా, సెన్సెక్స్ మళ్ళీ 47,000 దిశగా దూసుకెళ్తోంది. భారీ నష్టం తర్వాత వరుసగా రెండు రోజులు లాభపడ్డాయి. డాలర్ మారకంతో రూపాయి 10 పైసలు బలపడి 73.66 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. క్రితం సెషన్లో 73.76 వద్ద ముగిసింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ONGC 3.96 శాతం, టాటా మోటార్స్ 3.75 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.89 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 2.77 శాతం, IOC 2.67 శాతం లాభాల్లో ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇన్ఫోసిస్ 1.94 శాతం, నెస్ట్లే 1.78 శాతం, విప్రో 1.18 శాతం, టెక్ మహీంద్రా 1.14 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.15 శాతం నష్టాల్లో ఉన్నాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
కంపెనీలో మాతృసంస్థ 5% కొనుగోలు చేయనుందనే వార్తల నేపథ్యంలో వేదాంత స్టాక్స్ ఓ సమయంలో 13 శాతం పెరిగాయి. టాటా కమ్యూనికేషన్స్ 8 శాతం లాభపడ్డాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 సూచీ 0.55 శాతం, నిఫ్టీ 50 సూచీ 0.40 శాతం పెరిగాయి. నిఫ్టీ ఆటో 0.33 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.57 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.03 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.50 శాతం, నిఫ్టీ మీడియా 0.32 శాతం, నిఫ్టీ మెటల్ 1.03 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.47 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.50 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.39 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.14 శాతం, నిఫ్టీ ఐటీ 1.11 శాతం, నిఫ్టీ ఫార్మా 0.10 శాతం నష్టపోయాయి.

మిస్టర్ బెకార్డ్ డబుల్
ఇండియా టూరిజం, బీఈఎంఎల్, ది న్యూ ఇండియా, అస్యూర్, సిరా శానిటరీవేర్ భారీ లాభాలు నమోదు చేశాయి. మిస్టర్ బెకార్డ్ షేర్లు నేడు లిస్ట్ అయ్యాయి. 74 శాతంప్రీమియంతో లిస్ట్ అయింది. షేర్ జారీ ధర రూ.288 కాగా రూ.501 వద్ద లిస్ట్ అయింది. కంపెనీ ఈ ఐపీవో ద్వారా రూ.541 కోట్ల మేర సమీకరించాలని నిర్ణయించింది. ఐపీవో 198 శాతం సబ్‌స్క్రిప్షన్ నమోదు చేసింది. రిలయన్స్ స్టాక్ నేడు 1.10 శాతం లాభపడి రూ.1965 వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications