Ambani News: అనంత్ అంబానీ వాచ్‌పై జుకర్‌బర్గ్ దంపతుల కన్ను.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం!
Ananth Ambani Watch: అంబానీ ఇంట వివాహ వేడుకల గురించిన వార్తలు రోజూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దేశవిదేశాల నుంచి దిగ్గజ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కి హాజరయ్యారు. వారిలో ఫేస్‌బుక్ అధినేత కూడా ఉన్నారు. పెళ్లికొడుకు ధరించిన ఓ వస్తువు చూసి మార్క్ జుకర్‌బెర్గ్ దంపతులు మంత్రముగ్ధులయ్యారు. దాని వివరాలేంటో చూద్దాం..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ దంపతులు కూడా సందడి చేశారు. వారు పెళ్లికుమారుడితో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో మార్క్ మరియు ప్రిస్కిల్లాలు అంబానీ వాచ్ గురించి సంభాషిస్తున్నారు.

అనంత్ అంబానీ చేతి గడియారాన్ని గమనించిన ప్రిస్కిల్లా.. అది చాలా బాగుంది అని కితాబిచ్చింది. దానికి జుకర్‌బర్గ్ అంగీకరిస్తూ తాను ఇప్పుటికే ఆ విషయాన్ని అనంత్‌కు చెప్పానని జవాబిచ్చారు. దాన్ని ఎవరు తయారు చేశారని ఆమె అడగ్గా.. రిచర్డ్ మిల్లే అని అంబానీ తనయుడు పేర్కొన్నారు. తాను వాచ్ కావాలని ఎప్పుడూ కోరుకోలేదని జుకర్‌బర్గ్ చెప్పగా.. తనకు అది కావాలని ప్రిస్కిల్లా జోడించింది.
ఈ వీడియో వైరల్ అయిన వెంటనే పలువురు ఆ వాచ్ ధర మరియు కంపెనీ గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం ప్రారంభించారు. దాని ఖరీదు 10 కోట్లు ఉంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. X లోని ఒక పోస్ట్ ప్రకారం.. ఆ రిచర్డ్ మిల్లే వాచ్ విలువ 12-15 కోట్లు. అనంత్‌కు పటెక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్ స్కై మూన్ టూర్‌బిల్లాన్ కూడా ఉండగా దీని ధర 63 కోట్లు మరియు గ్రాండ్ మాస్టర్ చైమ్స్ విలువ 66 కోట్లు అని అందులో పేర్కొన్నారు.
అనంత్ అంబానీ ముందు జుకర్‌బర్గ్ కూడా మధ్యతరగతి స్థాయి వ్యక్తిలాగే ప్రవర్తిస్తున్నాడని యుజర్లు కామెంట్స్ చేస్తున్నారు. ధనవంతులు ఎలా జీవిస్తారో జుకర్‌బర్గ్ ఇప్పటికి గ్రహించాడని మరొకరు పోస్ట్ చేశారు. ఈ స్థాయి షో ఆఫ్ చూసి సాధారణ జీవితం గడిపే ఫేస్‌బుక్ అధినేతకు హార్ట్ ఎటాక్ వస్తుందని కొందరు వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications