దగ్గు సిరప్ తాగి 19 మంది పిల్లలు మృతి..! మారియన్ బయోటెక్ ఎక్స్ పోర్టు లైసెన్స్ రద్దు..
19 మంది పిల్లల మరణానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మారియన్ బయోటెక్ ఎక్స్ పోర్టు లైసెన్స్ ను రద్దు చేశారు. అంతేకాకుండా నోయిడాకు చెందిన దగ్గు సిరప్ తయారీదారు సంస్థలో మందుల ఉత్పత్తిని నిలిపివేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం ట్వీట్ చేశారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఓ) తనిఖీ తర్వాత చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.

ఫార్మాగ్జిల్
తమ దేశంలో కనీసం 18 మంది పిల్లలు మరణించారని (గురువారం 19వ తేదీ మరణించారు) ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య అధికారులు బుధవారం తెలిపారు. టానిక్ లో ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్ధం ఉందని ఆరోపించారు. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాగ్జిల్)దగ్గు మందు తయారీ లైసెన్సు, అనుమతులతోపాటు, దిగుమతిదారుల వివరాలు తెలియజేయాల్సిందిగా ఫార్మాగ్జిల్ ఆ సంస్థకు నోటీసు ఇచ్చింది. కంపెనీ నుంచి సమాధానం రాకపోవడంతో ఎక్స్ పోర్టు లైసెన్స్ ను రద్దు చేసింది.

గాంబియా
మారియన్ బయోటెక్ 2010లో చిన్న స్థాయి సంస్థగానూ, 2016లో ఎగుమతులు చేసేందుకు మారియన్ బయోటెక్ అనుమతులు పొందింది. కొద్ది రోజుల క్రితం న్యూఢిల్లీకి చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారుచేసిన మందులతో ముడిపడి ఉన్న గాంబియాలో కనీసం 70 మంది పిల్లల మరణించారు.

24.5 బిలియన్ డాలర్లు
"మేము నివేదికల కోసం ఎదురు చూస్తున్నాము, ఫ్యాక్టరీ తనిఖీ చేశారు. మేము అన్ని మందుల ఉత్పత్తిని నిలిపివేసాము" అని మారియన్ బయోటెక్ లీగల్ హెడ్ హసన్ హారిస్ వార్తా సంస్థ ANIతో చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఏడుగురు ఉద్యోగులను తొలగించింది. 'ప్రపంచంలోని ఫార్మసీ'గా పేరొందిన భారతదేశం గత దశాబ్ద కాలంలో ఫార్మా ఎగుమతులను రెట్టింపు చేసి, గత ఆర్థిక సంవత్సరంలో 24.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications