IPO News: ఈరోజు మార్కెట్లోకి కొత్తగా రెండు ఐపీవోలు అడుగుపెట్టాయి. అనూహ్యంగా రెండు కంపెనీలు అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. దీనికి తోడు మంచి ధరకే లిస్టింగ్ జరిగింది.
ఇప్పుడు మనం మార్కో కేబుల్స్ & కండక్టర్స్ లిమిటెడ్ ఐపీవో గురించే మాట్లాడుకోబోతున్నది. నేడు NSE SMEలో ప్రీమియం ధర వద్ద లిస్ట్ షేర్ చేయబడింది. ఈ క్రమంలో ఒక్కో షేరు రూ.38.70 రేటుకు జాబితా అయ్యాయి. ఇది ఇష్యూ ధర రూ.36 కంటే 7.5% అధిక ధర. లిస్టింగ్ జరిగిన తర్వాత కొద్ది సేపటికే ఐపీవో షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకాయి. ఇంట్రాడేలో గరిష్ఠంగా షేరు రూ.40 స్థాయికి చేరుకుంది.

మార్కో కేబుల్స్ IPO ధర బ్యాండ్ రూ.36గా నిర్ణయించబడింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఒక్కో లాటులో 3000 ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయించింది. కంపెనీకి సుమిత్ సుగ్నోమల్ కుక్రేజా, సుగ్నోమల్ మంగందాస్ కుక్రేజా, కోమల్ సుమిత్ కుక్రేజా ప్రమోటర్లుగా ఉన్నారు. IPO ద్వారా సేకరించిన నిధులను సోలార్ ఎనర్జీ సిస్టమ్, 1+12 రిజిడ్ స్ట్రాండింగ్ మెషిన్ కొనుగోలు కోసం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం కంపెనీ ఉపయోగించనుంది.
రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ భారతదేశంలోని విద్యుత్ కేబుల్స్ తయారీ పరిశ్రమలో 34 ఏళ్లకు పైగా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. దేశంలో వైర్లు, కేబుల్స్, కండక్టర్ల తయారీ విక్రయాల వ్యాపారంలో నిమగ్నమై ఉంది. శ్రేని షేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కో కేబుల్స్ IPO బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా ఉండగా.. బిగ్ షేర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇష్యూకి రిజిస్ట్రార్‌గా వ్యవహరించింది.


Click it and Unblock the Notifications