లిస్టింగ్‌లో అదరగొట్టిన వేదాంత్ ఫ్యాషన్స్, డిప్‌లో కొనుగోలు చేయవచ్చు!
ప్రముఖ వియర్ బ్రాండ్ మన్యావర్‌కు చెందిన వేదాంత్ ఫ్యాషన్స్ షేర్లు లిస్టింగ్‌లో అదరగొట్టాయి. ఇష్యూ ధర కంటే 8 శాతం అధిక ధరతో లిస్ట్ అయింది. మన్యావర్ మాతృసంస్థ వేదాంత్ ఫ్యాషన్స్. ఈ వేదాంత్ ఫ్యాషన్ స్టాక్ బుధవారం ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయింది. బీఎస్ఈలో 8.08 శాతం లాభంతో రూ.936 వద్ద, ఎన్ఎస్ఈలో 7.96 శాతం లాభంతో రూ.935 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ సంస్థ గతవారం ఐపీవోకు వచ్చింది. ఇష్యూ ధర రూ.866. ఈ ధర వద్ద రూ.3149 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 2.6 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుండి ఆదరణ లభిస్తుంది.

అదిరిపోయే ప్రాఫిట్
కోల్‌కతాకు చెందిన వేదాంత్ ఫ్యాషన్స్ షేర్లు లిస్టింగ్ సమయంలోనే అదరగొట్టాయి. రూ.866 ఇష్యూ ధర కాగా, రూ.936 వద్ద లిస్ట్ అయింది. అంటే రూ.70 ప్రాఫిట్ కనిపించింది. బీఎస్ఈ డేటా ప్రకారం లిస్టింగ్ అనంతరం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,716 కోట్లుగా నమోదయింది. వేదాంత్ ఫ్యాషన్ షేర్ ధర నేడు ఓ సమయంలో రూ.992 వద్ద గరిష్టాన్ని, రూ.927 వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2.40 సమయానికి రూ.953 వద్ద ట్రేడ్ అయింది. అంటే రూ.866 ఇష్యూ ధర కాగా రూ.87 ప్రాఫిట్ వచ్చినట్లు.

దీర్ఘకాలిక కోణంలో..
వేదాంత్ ఫ్యాషన్ స్టాక్ లిస్టింగ్‌లో అదరగొట్టిందని, అయితే వ్యాల్యుయేషన్ ప్రధాన ఆందోళన అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. పెట్టుబడిదారులు దీర్ఘకాలిక కోణంలో ఆలోచించి, కొనుగోలు చేయాలని, ప్రస్తుత గరిష్టం నుండి 15 శాతం నుండి 20 శాతం వరకు డిప్ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. లిస్టింగ్ గెయిన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు రూ.890 స్టాప్ లాస్‌తో కొనసాగవచ్చునని సూచిస్తున్నారు. మంచి ఫండమెంటల్స్‌తో బలమైన బ్రాండ్ వ్యాల్యూను వేదాంత్ ఫ్యాషన్ కలిగి ఉందని అంటున్నారు.

ఫ్లాగ్‌షిప్ బ్రాండ్స్
ఎన్ఎస్ఈలో ఇప్పటి వరకు దాదాపు 78 లక్షల వేదాంత్ ఫ్యాషన్ షేర్లు ట్రేడ్ కాగా, బీఎస్ఈలో 2.34 లక్షల షేర్లు ట్రేడ్ అయ్యాయి. వేదాంత్ ఫ్యాషన్ ఐపీవో ఫిబ్రవరి 4వ తేదీ నుండి 8వ తేదీ మధ్య జరిగింది. సబ్‌స్క్రిప్షన్ 2.57 రెట్లు అధికంగా కనిపించింది.
వేదాంత్ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ మేల్ ఎథిక్ బ్రాండ్ మన్యావర్. ఇతర బ్రాండ్స్ విషయానికి వస్తే త్వమేవ్, మంథన్, మోహె, మెబాజ్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications