RBI News: ఈరోజు ప్రారంభమైన మానిటరీ సమావేశాలు.. రిజర్వు బ్యాంక్ వడ్డీ పెంచుతుందా..?
MPC Meeting: ప్రస్తుతం మార్కెట్లలో అందరి చూపు నేడు ప్రారంభమైన రిజర్వు బ్యాంక్ మానిటరీ సమావేశాలపైనే ఉంది. ఈనెల 10న వడ్డీ రేట్ల విషయంలో కీలక ప్రకటన చేయనుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం దీనికోసం ఎదురుచూస్తున్నాయి.
దీనికి ముందు గతవారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా ఇండియాలో అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. తృణధాన్యాలు, కూరగాయలు, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది.

దీనికి తోడు రుతుపవనాలు ప్రస్తుతం దేశంలో వినియోదగారుల ధరల సూచిక పెరుగుదలకు దారితీసింది. ఈ పరిస్థితులు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించే సామర్థ్యాన్ని పరిమితం చేస్తోంది. వెండవది విరామం తర్వాత వడ్డీ రేట్లను పెంచడాన్ని పునఃప్రారంభించాలని US ఫెడరల్ రిజర్వ్ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కూడా MPC తప్పనిసరిగా పరిగణించాల్సి ఉంటుంది.
ఇదే క్రమంలో వడ్డీ రేట్లను ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే మరింతగా రిజర్వు బ్యాంక్ పెంచకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు పెరిగితే గృహ, వాహన, పర్సనల్ రుణాలను తీసుకున్న వారిపై అధిక భారం పడనుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే హౌసింగ్ లోన్ పొందిన వారు ప్రతి ఏటా 5 శాతం రుణాన్ని అదనంగా చెల్లించటం ఉపసమనాన్ని కలిగిస్తుందని బిగ్ బజార్.కామ్ సీఈవో ఆదిల్ శెట్టి సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications