Gold ETF: బంగారం ధరలు పెరుగుతాయని గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో భారీగా పెట్టుబడులు..!
బంగారం ధరల్లో గత రెండు సంవత్సరాల్లో అనూహ్య మార్పులు వచ్చాయి. పసిడి ధరలు భారీగా పెరిగాయి. జనవరిలో బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ధరలు ఇంకా పెరుగుతాయని చాలా మంది పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. అయితే ఫిజికల్ బంగారం కొనుగోలు చేయాలంటే డబ్బులు ఎక్కువ అవసరం పడతాయి. తులం కొనుగోలు చేయాలంటే.. రూ.1,50, 000 ఉండాల్సిందే. గ్రాము పసిడి కొనుగోలు చేయాలన్నా రూ.15 వేలు కావాల్సిందే. దీంతో పెట్టుబడిదారులు గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో గోల్డ్ మ్యూచువల్ ఫండ్ల లోకి భారీగా పెట్టుబడులు రావడంతో ఫండ్ హౌసెస్ పెట్టుబడులు సేకరించడం నిలిపివేశాయి.
దీంతో పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెట్టొచ్చు. దీంతో గోల్డ్ ఈటీఎఫ్ ల్లోకి భారీగా పెట్టుబడులు పెరిగాయి. పసిడి ధరలు తగ్గడం ఈ పెట్టుబడులు మరింత పెరిగాయి. గత ఆరు నెలల్లో బంగారం ధరలు సుమారు 12 శాతం వరకు పడిపోయాయి. అయితే బంగారం ధరలు భారీగా పెరుగుతాయనే అంచనాతో లాభాల కోసం చాలా మంది గోల్డ్ ఈటీఎఫ్‌లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో గోల్డ్ ఈటీఎఫ్ పథకాల నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) ఏప్రిల్ నెలలోని రూ.1.58 లక్షల కోట్ల నుంచి అక్టోబర్ నాటికి ఏకంగా రూ.1.91 లక్షల కోట్లకు పెరిగింది.

ఈ ఏడాది మే 29వ తేదీన 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,900 ఉండగా అక్టోబర్ 31 నాటికి రూ.20,900 మేర తగ్గి రూ.1.42 లక్షల స్థాయికి పడిపోయింది. అయితే బుధవారం రూ.4,800 పెరిగి రూ.1.46 లక్షలకు పెరిగింది. ఫిజికల్ గా బంగారం కొనుగోలు చేస్తే.. సెర్యూరిటీ ఇబ్బందులు ఉంటాయి. వాటిపై లోన్ తీసుకోలేరు. రా బంగారాన్ని బ్యాంకులో లాకర్ తీసుకుని దాచుకోవాల్సి ఉంటుంది. రా బంగారాన్ని ఆభరణాలు చేయిస్తే తరుగు ఉంటుంది. అయితే గోల్డ్ ఈటీఎఫ్ ల్లో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకే గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. షేర్ల లాగానే మార్కెట్ వేళల్లో వీటిని నేరుగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ప్లాట్‌ఫారమ్‌లపై ఎప్పటికప్పుడు మారుతున్న ధరలకు కొనుగోలు చేయవచ్చు.
వీటికి కూడా బ్రోకరేజ్, డీమ్యాట్, ఎక్స్పెన్స్ రేషియో వంటి చార్జీలు ఉంటాయి.ఈటీఎఫ్‌లు గత 12 నెలల్లో ఈ ఫండ్లు మదుపరులకు 30 శాతానికి పైగా లాభాలు అందించడంతో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. నిప్పాన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ గోల్డ్ ఈటీఎఫ్‌లు అత్యధికంగా 30.7 శాతం వరకు రాబడులు అందించాయి. గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెట్టడం వల్ల గోల్డ్ కొనుగోలు పెరిగి ధరలు పెరుగుతున్నట్లు పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications