పెద్దల సభలో బిలియనీర్లు.. అగ్ర స్థానంలో ఆంధ్ర, తెలంగాణ MPలు.. వీరు చాలా రిచ్ గురూ!

Richest MPs: దేశ వ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులు లోక్ సభ మరియు రాజ్యసభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. లోక్ సభ సభ్యుల ఎన్నిక ప్రజలచేత ప్రత్యక్షంగాను, రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఆయా పార్టీల అధినేత ఆమోదంతో పరోక్ష విధానంలోనూ జరుగుతూ ఉంటాయి. ఇలా ఎన్నిక కాబడిన పలువురు రాజ్యసభ సభ్యుల ఆస్తిపాస్తులు వింటే దిమ్మతిరగాల్సిందే.

రాజ్యసభకు ఎన్నికైన, నామినేట్ అయిన MPల ఎన్నికల అఫిడవిట్స్ ను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విశ్లేషించింది. 233 మంది MPలలో 225 మంది సగటు ఆస్తులు 80.93 కోట్లుగా ఉన్నట్లు నివేదించింది. 27 మంది MPలు కోటీశ్వరులు కాగా వీరిలోనూ 11 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్రల నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం.

Many of Rajya Sabha MPs are billionaires while AP and Telangan top in the list

ఈ మొత్తం కోటీశ్వరుల్లో అత్యంత ధనవంతులుగా TRS MP బండి పార్థ సారధి రికార్డు సృష్టించారు. ఆయన ఆస్తుల విలువ ఏకంగా 5 వేల 300 కోట్లకు పైమాటే. 2 వేల 577 కోట్లతో APలోని YSR కాంగ్రెస్‌ కు చెందిన అయోధ్యరామిరెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. SPకి చెందిన జయా బచ్చన్ 1,001.63 కోట్లతో తరువాతి స్థానం దక్కించుకున్నారు.

10 కోట్లకు పైగా ఆస్తులున్న MPలు 84 మంది కాగా 5-10 మధ్య 33 మంది ఉన్నారు. 1-5 కోట్ల లోపు ఉన్నవారు 77, 20 లక్షల నుంచి కోటి మధ్య ఉన్నవారు 23 మంది అని ADR తెలిపింది. 8 మంది MPల ఆస్తులు 20 లక్షల కంటే తక్కువేనని పేర్కొంది. 3.79 లక్షల ఆస్తితో AAP MP బల్బీర్ సింగ్ అత్యంత పేదవారుగా నిలిచారు. BJP MP మహారాజా సనజయోబా లీషెంబా 5.48 లక్షలు, మరో AAP MP సంజయ్ సింగ్ 6.60 లక్షలతో కొనసాగుతున్నారు.

రాజ్యసభలో అత్యధికంగా బిలియనీర్ MPలను కలిగి ఉన్న పార్టీ BJP. కమలం పార్టీలో 6గురు, కాంగ్రెస్ నుంచి 4గురు, YSR కాంగ్రెస్ లో 4 మంది MPలు ఈ కేటగిరీలో ఉన్నారు. ముగ్గురు AAP మరియు TRS MPలు, ఇద్దరు RJD MPలకు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు వారి ఎన్నికల అఫిడవిట్స్ లో ప్రకటించారని ADR పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+