Zerodha News: స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైనా బ్రోకర్ యాప్స్ ద్వారా జరుగుతాయి. ఒక్కోసారి సాంకేతిక కారణాలవల్ల ఆ యాప్స్‌లో లోపం తలెత్తుతూ ఉంటుంది. తద్వారా సరైన సమయానికి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కాక చాలామంది నష్టపోతూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉండడం సహజం. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల నడుమ ఇవాళ స్టాక్ మార్కెట్లు దద్దరిల్లాయి. ఆర్డర్స్ ప్రాసెస్ చేయలేక పలు మార్కెట్ బేస్డ్ యాప్స్ చేతులెత్తేశాయి.
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి BJP విజయ దుందుభి మోగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఘంటాపథంగా తెలిపాయి. దీంతో ఈరోజు ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. భారీ ఆర్డర్లు బ్రోకర్ యాప్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో ఒక్కసారిగా ఆయా సంస్థల సైట్లు, యాప్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. CDSL సహా జెరోధాలో ఇబ్బందులు ఎదుర్కున్నట్లు సోషల్ మీడియా వేదికగా యూజర్లు పోస్టులు పెట్టారు.

ఈ వ్యవహారంపై జెరోధా సిబ్బంది స్పందించారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వల్ల లోపం తలెత్తి ఉండవచ్చని, కుదిరితే సర్వీస్ మార్చి ట్రై చేయమని ఉచిత సలహా ఇచ్చారు. అప్పటికీ పరిస్థితి చక్కబడకపోతే తమ పేజీలో ఫిర్యాదు చేయాలని సోషల్ మీడియా వేదికగా సూచించారు. ఇక CDSLలోనూ ఆర్డర్ల తాకిడి తట్టుకోలేక సర్వర్లు చేతులెత్తేసాయి.
ఇదే విషయం గురించి జెరోధా CEO నితిన్ కామత్ సైతం మాట్లాడారు. కోట్లాదిమందికి సేవలు అందిస్తున్న సమయంలో సాఫ్ట్‌వేర్ పరంగా సమస్యలు రావడం సాధారణమేనని నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయితే యూజర్లు మాత్రం ఎదురు దాడికి దిగారు. జెరోధాలో తరచూ ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లు హైలెట్ చేశారు. 2023లో 8సార్లు టెక్నికల్ ప్రాబ్లం తలెత్తినట్లు గుర్తు చేశారు. తమ సొమ్ముకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications