DB Stock Broking scam: ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక రాబడుల మోజులో పడిపోతున్నారు. తక్కువ పెట్టుబడులపై ఎక్కువ రాబడులను అందిస్తామంటూ మాయగాళ్ల మాటలు నమ్మి వేల కోట్లు మునిగిపోతున్నారు. అయితే అలాంటి ఇన్వెస్ట్మెంట్ స్మామ్ ప్రస్తుతం హైదరాబాదీలను సైతం ముంచేసింది.
అవును మనం మాట్లాడుకుంటున్నది డీబీ స్టాక్ బ్రోకింగ్ స్కామ్ గురించే. రూ.7 వేల కోట్లకు సంబంధించిన ఈ బడా స్కామ్ అసోంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో హైదరాబాదుకు చెందిన కొందరు పెట్టుబడిదారులు సైతం నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు తేలింది. పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న తర్వాత హైదరాబాద్‌కు చెందిన పలువురు పెట్టుబడిదారులు ఫిర్యాదు చేయడంతో.. రూ.7,000 కోట్ల మేరకు పెట్టుబడిదారులను మోసగించినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సైబరాబాద్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గౌహతికి చెందిన డీబీ స్టాక్ బ్రోకింగ్ యజమాని దీపాంకర్ బర్మన్, అతని అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సెక్షన్ 5 కింద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. కంపెనీకి హైదరాబాదుతో పాటు ముంబై, బెంగళూరు, గౌహతిలో కూడా కార్యాలయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీనిపై పుప్పల్‌గూడకు చెందిన బాధితుడు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు గతనెల 23న ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. మంచి రిటర్న్ అందిస్తామని డీబీ స్టాక్ బ్రోకింగ్ నమ్మబలికిందని వాపోయాడు.
ఇదే క్రమంలో హైదరాబాదు చెందిన మరో బాధితుడు కంపెనీలో డిసెంబర్ 2022లో రూ.88.50 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించాడు. ఇప్పటి వరకు కొంత వడ్డీ ఆదాయాన్ని పొందానని పేర్కొన్నాడు. నగరానికి చెందిన విశ్వజీత్ సింగ్ కంపెనీలో రూ.36.80 లక్షలు పెట్టానని, ఇప్పటి వరకు వడ్డీ రూపంలో రూ.16.2 లక్షలు తిరిగి పొందినట్లు పేర్కొన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాదులోనే అనేక మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. డీబీ స్టాక్ బ్రోకింగ్ మోసానికి దేశవ్యాప్తంగా దాదాపు 23 వేల మంది బలయ్యారు. పోలీసులు సైతం బాధితులు ముందుకు రావాలని కోరుతున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉండగా ఆరోపణలో ఎదుర్కొంటున్న బర్మాన్, ఆగస్టు 21న తన కార్యాలయానికి తాళం వేసి గౌహతి నుంచి పారిపోయి ఆస్ట్రేలియాలో తలదాచుకున్నాడని తెలుస్తోంది. అక్కడ సైతం పెట్టుబడుల పేరుతో చాలా మందిని ఈ కంపెనీ ముంచిందని పోలీసులు చెబుతున్నారు.
పెట్టుబడుల పేరుతో అధిక రాబడులను ఆశజూపే ఇలాంటి కంపెనీలకు ప్రజలు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు అవగాహన క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నప్పటికీ తక్కువ సమయంలో ఎక్కువ రాబడులను ఆశిస్తున్న అనేక మంది మోసగాళ్ల మాటలతో నష్టపోతున్నారు.
More From GoodReturns

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Hyderabad: హైదరాబాద్లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్‌వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications