HNIs: ప్రపంచవ్యాప్తంగా సంపద,పెట్టుబడి కదలికలను హెన్లీ అనే ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ సంస్థ పర్యవేక్షిస్తూ ఉంటుంది. 2023కి గాను ఈ మేరకు ఓ నివేదికను ఆ సంస్థ విడుదల చేసింది. దాని ప్రకారం 6 వేల 500 మంది అధిక-నికర-విలువ కలిగిన వ్యక్తులు (HNIలు) భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది.
చైనా ఈ సంవత్సరం 13 వేల 500 మంది HNIలను కోల్పోతుందని నివేదిక వెల్లడించింది. గతేడాది నిష్క్రమించగా మిగిలిన వారిలో 7 వేల 500 మంది మిలియనీర్లు ఈసారి దేశాన్ని విడిచి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్ మాత్రం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొత్త మిలియనీర్లను ఉత్పత్తి చేయగలదని పేర్కొంది.

2031 నాటికి అధిక నికర-విలువ గల జనాభాలో పెరుగుదల 80 శాతం ఉంటుందని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో భారత్ వేగవంతమైన వృద్ధి రేటుతో ప్రపంచ సంపద మార్కెట్‌లలో ఒకటిగా మారుతుందని అంచనా వేసింది. ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ మరియు ఇతర రంగాలు ఈ అభివృద్ధిని ముందుండి నడిపిస్తాయని భావిస్తోంది.
జీవన ప్రమాణాలు పెరిగేకొద్దీ పలువురు సంపన్నులు తిరిగి ఇండియాకి వచ్చే ధోరణిని కూడా గమనించినట్లు హెన్లీ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా డబ్బు తరలింపు నమూనాలను పదేళ్లకు పైగా పర్యవేక్షిస్తున్న న్యూ వరల్డ్ మనీ అనే సంస్థ ప్రకారం, UKలో 3 వేల 200 మంది మిలియనీర్లు ఉండగా.. రష్యాలో 3 వేల మంది HNIలు ఉంటారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications