Elon Musk: ట్రంప్ గెలుపులో మస్క్ పెట్టుబడి.. అంబానీకి మూడిందిగా, బిలియనీర్ ప్లాన్స్..

Donald Trump 2.0: అమెరికా ప్రజలు తాజా ఎన్నికల్లో అధ్యక్షుడిగా భారీ మెజారిటీని రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసిన డొనాల్డ్ ట్రంపుకు ఇచ్చారు. దేశాన్ని ముందుకు నడిపించటానికి తాను సిద్ధంగా ఉన్నానని నేడు ట్రంప్ ఫలితాల చివరి సమయంలో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆయన నోట వచ్చిన పదం ఎలాన్ మస్క్. ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా ఉన్న మస్క్ డొనాల్ట్ ట్రంప్ గెలుపు కోసం ఎంతగా కృషిచేశారు, ఎంత డబ్బు ఖర్చుచేశారనే విషయం తెలిసిందే.

అమెరికా ప్రజలు అమ్మిగ్రేషన్, గన్ కల్చర్ విషయాల్లో చట్టపరమైన మార్పులను ఆశిస్తూ ఈ సారి ట్రంపుకు పట్టం కట్టారు. దీనిపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. అమెరికా భవిష్యత్తు అద్భుతంగా ఉండనుందని, 78 ఏళ్ల ట్రంప్ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగుపెడతారని అన్నారు. ఫలితాల వెల్లడి సమయంలో మస్క్ ట్రంప్ పక్కనే ఉంటూ లైవ్ వీక్షించారు. అయితే తాజాగా ట్రంప్ గెలుపు ఎలాన్ మస్క్ కు భారీగా కలిసొచ్చే అంశంగా వార్తలు వినిపిస్తున్నాయి. రెండవ టర్మ్ ట్రంప్ పరిపాలనలో మస్క్ కూడా ప్రభావవంతమైన పాత్రను పోషించగలడని అందరూ భావిస్తున్నారు. మస్క్ ఒక "కమీషన్"కి నాయకత్వం వహించాలని ట్రంప్ కోరుకుంటున్నారని ట్రంప్ ప్రచార సీనియర్ సలహాదారుడు చెప్పిన సంగతి తెలిసిందే. దీనివల్ల యూఎస్ ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, అమెరికన్లు చెల్లించిన పన్ను డబ్బును సమర్థవంతంగా ఉపయోగించటంలో ఇది దోహదపడుతుందని అన్నారు.

Many Expecting Elon Musk gains big with Donald Trump victory and administration Know how

ఈసారి ట్రంప్ సంపన్న వ్యక్తులపై కార్పొరేట్ పన్ను రేటును తగ్గించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇది ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తులకు కలిసొచ్చే అంశం. వాస్తవానికి 2017లో ఈ పన్నును 35 శాతం నుంచి 21 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ట్రంప్ తన మెుదటి టర్మ్‌లో టాప్ ఆదాయపు పన్ను రేటును 39.6% నుండి 37%కి తగ్గించిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారిలో ముందు వరుసలో ఉన్న ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యానికి ఉన్న ప్రయోజనాలను గమనిస్తే..

- స్పేస్‌ఎక్స్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్, నాసాలతో ఒప్పందాలతో సహా ప్రభుత్వ ఒప్పందాల్లో సంవత్సరానికి బిలియన్ డాలర్లను పొందే అవకాశం ఉంది. నాసా వ్యోమగాములను అంతరీక్షానికి తీసుకెళ్లేందుకు స్పేస్‌ఎక్స్ సేఫ్ అని ఇప్పటికే తెలిసిన సంగతి తెలిసిందే. ట్రంప్ విజయంతో ఎలాన్ మస్క్ కంపెనీల షేర్లు అమెరికా మార్కెట్లలో పుంజుకుంటున్నాయి. ప్రధానంగా టెస్లా స్టాక్ ధర భారీగా పెరిగినట్లు వార్తల్లో వినిపిస్తోంది.

- జో బిడెన్ పరిపాలనలో మస్క్ కొన్ని చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వాటి నుంచి రానున్న కాలంలో రిలాక్స్ పొందే అవకాశాలు ఉన్నాయి.

- టెస్లా ఎలక్ట్రిక్ కార్లు పూర్తిగా సెల్ఫ డ్రివెన్ చెప్పుకుంటూ విక్రయాలు కొనసాగిస్తున్నప్పటికీ.. మనుషుల పర్యవేక్షణ అవసరమౌతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలోనూ ఊరట లభించవచ్చు.

- స్పేస్ ఎక్స్ లాంచ్ ప్యాడ్ విషయంలో వన్యప్రాణులకు హానికలుగుతుందనే ఆరోపణలు ఉండగా ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఇదే క్రమంలో మస్క్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ ప్రాజెక్ట్ స్టార్ లింక్ ఇండియాలో పెద్ద అడుగులు వేసేందుకు అంబానీకి చెందిన జియో అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. శాటిలైట్ సేవల కోసం వేలం ఆధారిత స్పెక్ట్రమ్ ధరలను డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారత దేశంలోని శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ భవిష్యత్తు విషయంలో మస్క్ లాబియింగ్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే జియో, ఎయిర్ టెల్ వంటి ప్రైవేటు ఆటగాళ్లకు పెద్ద వ్యాపార ప్రమాదంగా మస్క్ స్టార్ లింక్ మారనుందని అంచనాలు ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+