Financial Crisis: మాంద్యం ముంగిట ప్రపంచం? ఇకపై అంతా గడ్డుకాలమేనా.. ఉద్యోగుల తొలగింపులు అందుకేనా..

Financial Crisis: ఉద్యోగులకు కంపెనీలు గుడ్ బై చెప్పే సమయం వచ్చిందా..! ప్రపంచం మళ్లీ 2008 లాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదా..? RIP గుడ్ టైమ్స్ అంటూ ఒక బ్రోకరేజ్ సంస్థ చేసిన మీమ్ వైరల్ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచంలో కూడా పరిస్థితి దాదాపుగా ఇలాగే కనిపిస్తోంది. మొదట కొవిడ్, తర్వాత రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, వీటికి తోడు వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగాల కోత ప్రారంభించాయి. అందులోనూ స్టార్టప్ కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. స్టార్టప్ హబ్‌గా దూసుకుపోతున్న భారత్‌లో ఇలాంటి కంపెనీలు ఇప్పటి వరకు 10,000 మంది ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి. ఇవి రాబోయే ఆర్థిక మందగమనానికి సంకేతాలా? అనే అనుమానాలు అందరినీ వెంటాడుతున్నాయి.

 మంచి రోజులకు కాలం చెల్లిందా?

మంచి రోజులకు కాలం చెల్లిందా?

స్టార్టప్ కంపెనీలకు.. ముఖ్యంగా వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి ఒత్తిడిని అందుకుంటున్న టెక్ స్టార్టప్‌లకు మంచి రోజులు రాబోతున్నాయి. క్యాష్ బర్నింగ్ మోడల్ లో వ్యాపారాలు చేస్తున్న స్టార్టప్ కంపెనీలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు ప్రారంభించాయి. అందుకే జనవరి 2022 నుంచి ఇప్పటి వరకు.. స్టార్టప్ కంపెనీల్లో పనిచేస్తున్న సుమారు 8,000 నుంచి 10,000 మంది ఉద్యోగులు పింక్ స్లిప్‌లను పొందారు. రానున్న కాలంలో ఉద్యోగుల తొలగింపు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ దీనికి కారణాలేంటో చూద్దాం..

 ఉద్యోగుల తొలగింపుకు కారణాలు:

ఉద్యోగుల తొలగింపుకు కారణాలు:

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఉద్యోగాలు కోల్పోతున్న విషయం అర్థమవుతుంది. ముందుగా దేశీయ స్టాక్ మార్కెట్లు అనిశ్చితిలో కొనసాగుతున్నాయి. Zomato, Paytm, Nykaa వంటి స్టార్టప్ కంపెనీల పనితీరు దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లలో న్యూ ఏజ్ టెక్ స్టార్టప్ కంపెనీలపై విశ్వసనీయత పడిపోయింది. మరోవైపు.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్ల పెంపువల్ల రుణాలు ఖరీదైనవిగా మారాయి. యుద్ధం తరువాత వెంచర్ క్యాపిటలిస్టులతో ఒప్పందాలూ తగ్గాయి. స్టార్టప్ కంపెనీల పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. కంపెనీల పరితీరు మెరుగుపడాలని ఇన్వెస్టర్ల నుంచి కూడా స్టార్టప్ కంపెనీలపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది.

 ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు:

ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు:

ఉద్యోగులను తొలగించిన స్టార్టప్ కంపెనీల జాబితా చాలా పెద్దది. ఫిబ్రవరిలో లిడో లెర్నింగ్ 1200 మంది ఉద్యోగులను ఫైర్ చేసింది. ఆ తర్వాత అన్‌ఎకాడెమీ ఏప్రిల్‌లో 925 మందిని, ఏప్రిల్‌లో వేదాంతు 600 మందిని, ఫ్రంట్‌రో 145 మందిని తొలగించాయి. ఇక మీషో, ఓకేక్రెడిట్, కార్స్ 24, ఎంఫైన్, ఎమ్‌పీఎల్ వంటి కంపెనీలు కూడా వందలాది మందిని తీసేశాయి. మొత్తం మీద ఈ సంఖ్య 8 నుంచి 10 వేల వరకు చేరుకుంది.

 అంతర్జాతీయంగానూ అదే తీరు:

అంతర్జాతీయంగానూ అదే తీరు:

అంతర్జాతీయ స్థాయిలో కూడా పరిస్థితి అస్సలు బాగోలేదు. ఉద్యోగుల తొలగింపులు కేవలం భారతదేశంలోనే కాక, ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా కనిపిస్తోంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ కూడా దాదాపు 150 మంది ఉద్యోగులను, డజన్ల కొద్దీ కాంట్రాక్టర్లను తొలగించింది. ఇలాంటి సంఘటనలు ప్రపంచంలోని అనేక దేశాల్లో నిత్యకృత్యంగా మారుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+