adani: హిండెన్‌బర్గ్ రీసెర్చి నివేదిక విడుదల అనంతరం అదానీ కంపెనీల్లో ఎంత గందరగోళం నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు గ్రూపు కంపెనీలన్నీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరి అయింది. ఆ సంస్థల షేర్లు దాదాపు ప్రతిరోజూ లోయర్ సర్క్యూట్లను టచ్ చేస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో రెడ్ లో ఉన్న షేర్లు ఒక్కసారిగా గ్రీన్ లోకి మారి షాక్ ఇచ్చాయి. చాలా మందికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు.

ఒక్కసారిగా భారీ లాభాల్లోకి:
తీవ్ర ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీకి, మంగళవారం షేర్ల రీబౌండింగ్ కొంత ఊపిరి పోసినట్లయింది. 8 లిస్టెడ్ కంపెనీల షేర్స్ బాగా పుంజుకున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ అయితే ప్రారంభంలో 7 శాతానికి పడిపోయింది. అనంతరం వేగంగా తిరిగి గ్రీన్ లోకి వచ్చింది. కనిష్ఠ స్థాయి నుంచి దాదాపు 24 శాతం భారీ రీబౌండింగ్ ను నమోదు చేసింది. మధ్యాహ్నం 1.30 సమయంలో 12.64 శాతం పెరిగి రూ.1,344.40 వద్ద ట్రేడయింది. మార్కెట్ ముగిసే సమయానికి 15 శాతం వృద్ధితో రూ.1,3,71కి చేరింది.

ఇదీ రీబౌండింగ్ కారణం:
అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ విల్మార్, ACC, అంబుజా సిమెంట్స్, NDTV వంటి గ్రూపులోని ఇతర లిస్టెడ్ కంపెనీల్లోనూ ఇదే వైఖరి కనిపించింది. కేవలం అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ మాత్రమే 5 శాతం లోయర్ సర్క్యూట్ వద్ద ఆగిపోయాయి. 2023 మార్చి చివరి నాటికి 690 మిలియన్లు-790 బిలియన్ల మేర షేర్-బ్యాక్డ్ లోన్లను ముందస్తుగా తిరిగి చెల్లించాలని గ్రూపు చూస్తున్నట్లు వార్తా ఏజెన్సీ రాయిటర్స్ నివేదించడమే ఈ భారీ రీబౌండింగ్ కు కారణంగా తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

అదానీ గ్రీన్ ఎనర్జీ ఎందుకు పెరిగిందంటే..
గ్రూపు క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో రుణాల చెల్లింపులకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. తద్వారా లిస్టెడ్ కంపెనీల్లో పేరుకుపోయిన అధిక రుణాలపై పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఆందోళనకు కొంతమేర ఉపశమనం కల్పించవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది. 800 మిలియన్ డాలర్ల విలువైన 2024 వ్యవధి బాండ్లను మూడేళ్ల క్రెడిట్ లైన్ ద్వారా రీఫైనాన్స్ చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు చెప్పింది. దీంతో ఈ నివేదిక తర్వాత అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 5 శాతం ఎగువ సర్క్యూట్ ను తాకాయి.

బ్యాంకుల తీపికబురు:
అదానీ ఎంటర్ ప్రైజెస్ కోసం బ్యాంకులు క్రెడిట్ పరిమితులు రిటైన్ చేసినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదించడమూ.. షేర్ల భారీ ర్యాలీకి మరో కారణమైంది. SBI నేతృత్వంలోని దేశీయ రుణదాతలు గ్రూపునకు మంజూరు చేసిన క్రెడిట్ పై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించినట్లు నివేదిక వెల్లడించింది. అయితే ఆస్ట్రేలియాలోని ఓ ప్రముఖ సంస్థ షేర్ల ద్వారా రుణాలు సమీకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు.. ఫిబ్రవరి 27న విడుదలైన వార్తలను అదానీ గ్రూపు ఖండించింది.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications