adani: హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూపు లక్షల కోట్ల రూపాయలు మేర నష్టపోవడం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఉన్నత న్యాయస్థానం విషయంపై విచారణ సైతం చేపట్టింది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఓ కమిటీని నియమిస్తామని స్పష్టం చేసింది. కాగా ఈరోజు న్యాయస్థానంలో దీనిపై మరోసారి విచారణ జరిగింది. అయితే పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలకు కోర్టు సహకరించినట్లయింది.

సుప్రీం ఆదేశాలివి:
సెక్యూరిటీల చట్టాన్ని అదానీ గ్రూపు ఉల్లంఘించిందో, లేదో దర్యాప్తు చేయవలసినదిగా సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ సైతం న్యాయస్థానం తీర్పుపై ట్విట్టర్ లో స్పందించారు. కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సత్యమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటన పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచినట్లయింది. ఇది జరిగిన తర్వాత అదానీ కంపెనీలు గ్రీన్ లో ట్రేడింగ్ కావడం ప్రారంభించాయి.

భారీగా బ్లాక్ డీల్స్:
సావరింగ్ వెల్త్ ఫండ్ ద్వారా 3 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ తీసుకోనున్నట్లు బయటకు వచ్చిన నివేదికలను అదానీ గ్రూపు తిరస్కరించడం తెలిసిందే. అయితే బ్లాక్ డీల్ విండోలో మాత్రం పెద్ద ఎత్తున ఆసక్తి కనబరచింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ లో 3.5 శాతం అంటే 3.9 కోట్ల షేర్లు నిన్న చేతులు మారాయి. వీటి విలువ రూ.5,520 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. దానితో పాటు అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీల్లో సైతం 4.1, 2.5, 3.5 శాతం చొప్పున బ్లాక్ డీల్స్ జరిగినట్లు తెలుస్తోంది.

అప్పర్ సర్క్యూట్లలో..
ఈ బ్లాక్ డీల్స్ అనంతరం.. మార్కెట్ ఓపెన్ కావడంతోనే అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్ మిషన్ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ ని తాకాయి. మొదట్లో రెడ్ లో ట్రేడింగ్ కొనసాగించిన అదానీ ఎంటర్ ప్రైజెస్ తిరిగి బౌన్స్ బ్యాక్ అయింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 1,407 రూపాయల నుంచి 1,607 కి చేరింది. అదానీ పోర్ట్స్ సైతం నిన్నటి క్లోజింగ్ తో పోలిస్తే 0.6 శాతం వృద్ధి కనపరిచింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications