Gold Price: బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గవు.. అందుకే..!
బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక సేవల దిగ్గజం స్టాండర్డ్ చార్టర్డ్‌కు చెందిన చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ మన్‌ప్రీత్ గిల్ అన్నారు. కేంద్ర బ్యాంకులు నిల్వలను పెంచుకోవడం, డాలర్ బలహీనపడటం, యూఎస్ డాలర్ ఈల్డ్ కర్వ్ తీవ్రతరం కావడంతో, బంగారం ధరలు మరో ర్యాలీకి నాంది పలకవచ్చని అంచనా వేశారు. ఇటీవల బంగారం 4,000 డాలర్ల స్థాయిని దాటిందని ఆయన పేర్కొన్నారు. గిల్ బంగారంపై తన పెట్టుబడిని అధికంగా ఉంచుతూ బుల్లిష్‌గా ఉన్నారు. రాబోయే ఆరు నుంచి 12 నెలల్లో బంగారం ధర 5,000 డాలర్లకు చేరుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు.
ప్రపంచ మార్కెట్లు ఇబ్బందుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్లపై తాము సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. జపాన్ మినహా ఆసియా మార్కెట్లలో భారత్‌ను ప్రధాన పెట్టుబడి విభాగంగా ఉన్నట్లు అంచనా వేశారు. అయితే కొరియా, తైవాన్ వంటి ఏఐ ఆధారిత మార్కెట్ల వైపు పెట్టుబడులు ఎక్కువగా మళ్లే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో భారత్ ఏఐ థీమ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, పెట్టుబడులను ఇతర రంగాలు, మార్కెట్ల వైపు విస్తరించాలని అభిప్రాయపడ్డారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ ఇంధనంతో ముడిపడి ఉందన్నారు. ఇంధన ధరలు పెరిగితే ఆర్థిక వ్యవస్థపై భారం పడే అవకాశం ఉందన్నారు.

వచ్చే రెండు నెలల్లో కూడా చమురు ధరలు బ్యారెల్‌కు సుమారు వంద డాలర్ల స్థాయిలో కొనసాగవచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్య ఇంధనంపై ఆధారపడి ఉన్న దేశాలపై ఒత్తిడి తప్పదన్నారు. మార్కెట్లు పడిపోతుంటే.. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. ఫలితంగా పసిడి ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉందన్నారు.
బంగారం ధర పెరుగుతుందని భారీగా పసిడిపై పెట్టడం కంటే.. క్రమ క్రమంగా పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. గోల్డ్ మాన్ శాక్స్ కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. పిసిడి ధరలు దీర్ఘకాలంలో పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
