రహస్యంగా భారత బంగారం తాకట్టు.. అలా ఆర్థిక వ్యవస్థను మార్చేసిన మన్మోహన్ సింగ్..!
Manmohan Singh: మన్మోహన్ సింగ్ ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా, ఎవరి నోటవిన్నా ఆయన పేరే. ఆయన భారతదేశానికి చేసిన మేలు అనేక తరాల భవితవ్యాన్ని పూర్తిగా మార్చేయటమే దీనికి ప్రధాన కారణం. అయితే అది అంత సులువుగా జరగలేదనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1990ల ప్రారంభంలో భారత్ ఆర్థిక పతనం అంచున ఉంది. అప్పట్లో ప్రభుత్వం విపరీతమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దేశంలో విదేశీ మారక నిల్వలు కేవలం $1.2 బిలియన్లకు పడిపోయాయి. ఆ మెుత్తం కేవలం మూడు వారాల అవసరమైన దిగుమతుల చెల్లింపుల కోసం సరిపోవు. చెల్లింపుల బ్యాలెన్స్ పరిస్థితి మరింత దిగజారడంతో, PM చంద్ర శేఖర్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వద్ద ఇండియా తన 67 టన్నుల బంగారు నిల్వలను తాకట్టుగా ఉంచడం ద్వారా అత్యవసర రుణాన్ని పొందింది. ఈ క్రమంలో ఆర్బీఐ 47 టన్నులను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, 20 టన్నులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ కి సమీకరించవలసి వచ్చింది. 1991లో ఎన్నికల మధ్య ప్రభుత్వం బంగారాన్ని రహస్యంగా ఎయిర్‌లిఫ్ట్ చేసింది. పసిడిని తాకట్టుపెట్టినట్టు బయటకు పొక్కటంతో అప్పటి చంద్రశేఖర్ ప్రభుత్వం కుప్పకూలింది.

ఈ క్లిష్ట సమయంలోనే పీవీ నరసింహారావు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ను ఆశ్రయించారు. భారతదేశాన్ని పతనం అంచు నుంచి వెనక్కి లాగడానికి తీవ్రమైన సంస్కరణలు అవసరమని అర్థం చేసుకున్నారు. దీని తర్వాత 1991 జూలై 1న మన్మోహన్ భారత ఆర్థిక చరిత్రను మార్చేందుకు ధైర్యవంతమైన సంస్కరణలను ప్రారంభించారు. ఈ క్రమంలో రూపాయి మారకపు విలువను 9 శాతం మేర తగ్గించారు. ఎగుమతులను మరింతగా పోటీగా మార్చటంతో పాటు ఆర్థిక లోటును పరిష్కరించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మన్మోహన్ చర్యలు ఇక్కడితో ఆగిపోలేదు. సుంకాలను తగ్గించటంతో పాటు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించటం ప్రాముఖ్యత గురించి ఆయన దృష్టి పెట్టారు. దేశంలో ప్రైవేటు రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించటం ప్రారంభించారు. దీంతో ఎకానమీని ఓపెన్ చేశారు. దీని కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానానికి మార్గం వేశారు. దేశం తన భవిష్యత్తును కాపాడుకోవడానికి గ్లోబలైజేషన్ స్వీకరించవలసి వచ్చింది. అలాగే దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలు దశాబ్దాలుగా అసమర్థంగా ఉన్నాయని గమనించిన సింగ్ దీనిని పరిష్కరించటానికి దేశంలో ప్రైవేటు వ్యాపార కార్యకలాపాలను నిర్వహించటానికి అవసరమైన స్వేచ్ఛను, పుష్ ఇచ్చారు.
సంస్కరణలకు వ్యతిరేకంగా రాజకీయ సవాళ్లు, విస్తృత నిరసనలు ఉన్నప్పటికీ, సింగ్-నరసింహారావు సరళీకరణ మార్గానికి కట్టుబడి ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకునే సంకేతాలను చూపడం ప్రారంభించింది. 1990ల మధ్య నాటికి దేశం ఒకప్పుడు సాధించలేనిదిగా అనిపించిన వృద్ధి రేటును చూసింది. భారతదేశం ఇకపై క్లోజ్డ్, స్తబ్ద ఆర్థిక వ్యవస్థగా చూడబడలేదు. దీని తర్వాత కొన్ని దశాబ్ధాల్లో భారత ఆర్థిక వ్యవస్థ మేగంగా అభివృద్ధి చెందటం మనందరి కళ్ల ముందే జరిగింది. ఇది కోట్ల మంది భారతీయుల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకురావటంతో పాటు లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేసింది.
సింగ్ సంస్మరణల కారణంగా దేశం విదేశీ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. 2000ల నాటికి భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ప్రశంసించబడింది. దీని తర్వాత ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో బ్రిటీష్ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీతో సహా అనేక మంది ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకులు సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలో సలహాల కోసం మన్మోహన్ సింగ్‌ను ఆశ్రయించారు.


Click it and Unblock the Notifications